ఇంత తొందరగా బయటకు పంపుతారని ఊహించలేదు.. అభినయ ఎమోషనల్ కామెంట్స్!

ఎన్నో సినిమాలు నటించి నటిగా మంచి గుర్తింపు పొందిన అభినయ శ్రీ గురించి తెలియని వారంటూ ఉండరు. అంతేకాకుండా సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి అభినయ బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం అనే పాటతో బాగా ఫేమస్ అయ్యింది. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అభినయశ్రీ ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకుంది. ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమై ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకొని మూడవ వారం కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా మొదటి వారంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయటం నామినేషన్ లో కంటెస్టెంట్స్ సేవ్ అయ్యారు. ఇక రెండవ వారం మాత్రం బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేశాడు. శనివారం షానీని ఎలిమినేట్ చేయగా… ఆదివారం అభినయ శ్రీ ని ఎలిమినేట్ చేశాడు. ఎంతో నమ్మకంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన అభినయశ్రీ.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో మాత్రం చురుగ్గా పాల్గొనలేదు. అందువల్ల నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున అభినయని ఎలిమినేట్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన అభినయ మాట్లాడుతు..ప్రేక్షకులు నన్ను ఇంత తొందరగా బయటికి పంపుతారని ఊహించలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. కొంత సమయం తర్వాత నాగార్జున ఆమెకి ఒక టాస్క్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న సభ్యులలో హానెస్ట్ గా ఉన్న ఐదు మంది పేర్లని, హానెస్ట్ గా లేని ఐదు మంది పేర్లని చెప్పమన్నారు. ఈ క్రమంలో శ్రీ సత్య, చంటి, పైమా, సూర్య , బాలాదిత్య లను హోనేస్ట్ గా ఉంటారని చెప్పింది. ఆ తర్వాత రేవంత్ ని నాన్ హనేస్ట్ అని చెప్పింది.