హైపర్ ఆది రీఎంట్రీ జబర్దస్త్ కు ఏమైనా కలిసి వచ్చిందా?

జబర్దస్త్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను వంటి వాళ్ళు ఒకరు.ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీళ్ళకి ఏకంగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా సినిమా అవకాశాలు రావడంతోనే వీళ్లు జబర్దస్త్ కార్యక్రమాన్ని నుంచి తప్పుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి..

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకుండా ఈ ముగ్గురు కొంతకాలం పాటు ఇతర కార్యక్రమాలలో సందడి చేశారు.అయితే జబర్దస్త్ కార్యక్రమానికి హైపర్ ఆది గెటప్ శ్రీను తిరిగి వచ్చినప్పటికీ సుడిగాలి సుదీర్ మాత్రం తిరిగి రాలేదు. ఇక హైపర్ ఆది ఈ వారం జబర్దస్త్ కార్యక్రమంలో తిరిగి సందడి చేశారు.గత వారం ప్రోమో విడుదల చేసినప్పటి నుంచి హైపర్ ఆది ఈ కార్యక్రమంలో సందడి చేయబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలు పెరిగాయి. ఇక హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వడంతో తన స్కిట్ కోసం ఈయనకు ఏకంగా 14 నిమిషాల పాటు సమయం ఇచ్చారు.

హైపర్ ఆది ఈ కార్యక్రమానికి తిరిగి వచ్చిన తర్వాత యధావిధిగా తనదైన శైలిలో అందరిపై పంచ్ లు వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఆది తిరిగి రావడంతో ఈ కార్యక్రమానికి పూర్వ వైభవం వచ్చిందని పలువురు భావిస్తున్నారు.మరి హైపర్ ఆది తిరిగి రావడం వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి నిజంగానే రేటింగ్ పెరిగిందా అనే విషయానికి వస్తే అనధికారిక సమాచారం ప్రకారం ఆది ఈ కార్యక్రమానికి తిరిగి రావడం వల్ల 12 నుంచి 15 వరకు ఈ కార్యక్రమ రేటింగ్ పెరిగి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇక హైపర్ ఆది ఈ కార్యక్రమంలో కొనసాగితే ఈ కార్యక్రమ రేటింగ్ కూడా భారీగా పెరుగుతుందని చెప్పాలి.