భార్యతో కలిసి వేదికపై రచ్చ చేసిన గల్లీ బాయ్స్ రియాజ్.. వీడియో వైరల్?

టాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్స్ రియాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తన కామెడీతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. పలు సినిమాలలో కూడా నటించాడు రియాజ్.ఈయన కెరీర్ మొదట్లో సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాతే బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఇక ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు. అందులో తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటాడు.

ఇక ఈయన చూడటానికి చాలా పొట్టిగా ఉంటాడు. అలా ఉండటం వల్లే ఈయనకు మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఆయన అలా ఉండి కూడా తనలో ఇంత టాలెంట్ ఉండటంతో ఆయనను ఎంతోమంది పొగిడారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఈయన ఒక ఇంటివాడయ్యాడు.అదేనండోయ్ ఈయన కూడా ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇటీవలే ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో చాలామంది ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇక తాజాగా ఆయన తన భార్యతో కలిసి మొదటిసారి బుల్లితెరపై అడుగుపెట్టాడు.

జీ తెలుగు వారి జాతర బోనాల స్పెషల్ గా ఒక ఈవెంట్ నిర్వహించగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో జీ తెలుగు సీరియల్స్ కుటుంబం మొత్తం పాల్గొన్నారు. ఇక రియాజ్ కూడా తన భార్యతో రావటంతో వేదికపై తన భార్యని అందరికీ పరిచయం చేశాడు. పైగా తన భార్య కూడా అప్పుడే రియాజ్ కి సపోర్ట్ చేయడంతో.. ఆ ప్రోమో చూసిన నెటిజన్లు పొట్టి రియాజ్ అప్పుడే భార్యను తనవైపు మలుపుకున్నాడు అంటూ గట్టోడే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Riyaz Promo | Zee Telugu Vaari Jathara | Bonala Celebrations | This Sunday at 6 PM | Zee Telugu