జీవితంలో వెనక్కి వెళితే నేను ఆమె చనిపోకూడదని కొరుకుంటా…కన్నీళ్ళు పెట్టుకున్న కుష్బూ?

అలనాటి అందాల నటి హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన కుష్బూ తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ గా గుర్తింపు పొందింది. డబ్బు కోసం ఆమె అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టించారంటే ప్రేక్షకులలో ఆమెకి ఉన్న పాపులారిటీ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కుష్బూ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.

అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో జడ్జ్ గా కూడా వ్యవహరిస్తూ తన జడ్జిమెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో కుష్బూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో గెటప్ శ్రీను రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో స్కిట్ చేశారు. ఈ స్కిట్ అయిపోయిన తర్వాత రష్మి జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే మీరేం కోరుకుంటారు? అని అందరిని ప్రశ్నించింది.

ఈ క్రమంలో కుష్బూ గారిని కూడా జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే మీరు ఏం కోరుకుంటారు? అని రష్మి ప్రశ్నించింది. కుష్బూ స్పందిస్తూ… 1984లో నేను సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాను. ఆ సమయంలో ఉబెన్ ఆంటీ నాతో వచ్చారు. ఆమె నా హెయిర్ డ్రస్సర్ గా 2011 వరకు ఆమె నాతో కలిసి ఉంది. ఆ తర్వాత క్యాన్సర్ వల్ల ఆమె మరణించింది. ఆమె లేని లోటు చాలా బాధాకరం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఆమె మరణించకూడదని కోరుకుంటాను అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.