ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యి కమెడియన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఇక జబర్థస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో పొట్టి నరేశ్ కూడా ఒకరు. పొట్టి నరేశ్ తన లోపాన్ని అనుకూలంగా మార్చుకుని జబర్థస్త్ లో తన మీద తానే సెటైర్లు వేసుకుంటూ కామెడీ చేస్తున్నాడు. ఇక తన కామెడీ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో కూడా నరేశ్ సందడి మామూలుగా లేదు.
ఈ ఎపిసోడ్ లో నరేష్ లైఫ్ ఉన్న రియల్ లవ్ స్టొరీ గురించి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ పర్ఫార్మెన్స్ చూసి అక్కడున్న వారందరూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. నరేశ్ పర్ఫామెన్స్ చేసిన స్కిట్ విషయానికి వస్తే.. ఒక స్టేజ్ మీద నరేష్ డాన్స్ చేస్తుండగా.. అతడి డ్యాన్స్ చూసి ఒక అందమైన అమ్మాయి ఇంప్రెస్ అయ్యి అతనితో ప్రేమలో పడుతుంది. నరేష్ ఆ అమ్మాయితో కలసి రొమాంటిక్ గా డ్యాన్స్ కూడా చేస్తాడు. అయితే ఒక రోజు ఆ అమ్మాయి సీక్రెట్ గా తన అసలైన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న సమయంలో ఇంకా ఆ పొట్టోడితోనే తిరుగుతున్నావా? అని ఆమె బాయ్ ఫ్రెండ్ అడగ్గా..ఆ పొట్టోడు ఈవెంట్స్ లో సంపాదించిన డబ్బు మొత్తం మనం తీసుకు వాడిని వాడుకుని వదిలేద్దాం అని ఆ అమ్మాయి చెబుతుంది.
ఇదంత విన్న నరేష్ గుండె బద్దలై పోతుంది. ప్రేమ పేరుతో తనని మోసం చేయటమే కాకుండా తనలో ఉన్న లోపం గురించి అవహేళనగా మాట్లాడటంతో నరేష్ పిచ్చోడిగా మారిపోయి తనని తాను శిక్షించుకుంటాడు. నరేష్ తన రియల్ లైఫ్ లో ఉన్న లవ్ స్టోరీ గురించి పర్ఫార్మెన్స్ చేసి అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు. నరేష్ పెర్ఫార్మన్స్ చూసి జడ్జిలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ షో కి గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ సదా కూడా నిజంగానే మీ లైఫ్ లో ఈ బాధ ఉందా? అని అడగగా.. ఉంది మేడం అని నరేష్ సమాధానం చెబుతాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో నరేష్ అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు.