బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న గీతూ.. అసలు నిజం ఇదే?

ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ షో రోజు రోజుకి కొట్లాటలు, గొడవలతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇకపోతే ఇటీవల తొమ్మిదవ వారం ఎలిమినేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. 9వ వారం ఎలిమినేషన్ హౌస్ లో షాకింగ్ అలాగే ఎమోషనల్ గా సాగాయి అని చెప్పవచ్చు. ఎవరు ఊహించని విధంగా టాప్ ఫైవ్ లో ఉంటుంది అనుకుంటున్న గీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే గీతూ ఎలిమినేషన్స్ పై ఆమె అభిమానులు మండిపడుతున్నారు.

కొందరు అయితే ఇకపై బిగ్ బాస్ హౌస్ లో గీతూ గొడవ ఉండదు మనశ్శాంతిగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన గీతూ కూడా నేను ఇక్కడ నుంచి వెళ్లను సార్ అంటూ నాగార్జున ముందే బోరున వెక్కి వెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై గీతూ ఎమోషనల్ అవుతున్న తీరుని చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లతో పాటు నాగార్జున సైతం కంటతడి పెట్టారు. బిగ్ బాస్ స్టేజ్ నుంచి ఆమె ఎంతసేపటికి వెళ్లకపోతే సరికి నాగార్జున అక్కడ ఉన్న సిబ్బందిని పిలిపించి మరి ఆమెను పంపించేశారు. ఇది ఇలా ఉంటే తాజా గీతూ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి గీతూ మళ్ళీ గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో గీతూ ఎలిమినేషన్ అన్నది బిగ్ బాస్ షో కి ఒక మైనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తాను గేమ్ ఆడటంతో పాటు నలుగురిని ఆడించే గీతూ ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఇకపై పోటీ వాతావరణం కనిపించకపోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగో హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఒక కంటెస్టెంట్ ని పంపించాలి అనుకుంటున్నా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆ వైల్డ్ కార్డు ద్వారా గీతూనే మళ్లీ లోపలికి పంపే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా రెండు మూడు వారాలు హౌస్ మేట్స్ ఆటతీరు షో రేటింగ్స్ ని చూసిన తర్వాత గీతూ ని హౌస్ లోకి పంపాలా వద్దా అన్న అన్న నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే గీతూ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ వార్తపై ఒక వర్గం ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఆమె హౌస్ కి రావడం ఇష్టం లేదు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.