అన్ స్టాపబుల్ సీజన్ 2 లో చిరంజీవి… బాలయ్య రియాక్షన్ ఏంటో తెలుసా..?

దివంగత నటుడు నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ ఎన్నో దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే బాలకృష్ణ మరొకవైపు రాజకీయాలలో కూడా పాల్గొని తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఇటీవల ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె టాక్ షో ద్వారా హోస్ట్ గా మారిన బాలకృష్ణ తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అన్ స్టాపబుల్ సీజన్ బాలయ్య హోస్టింగ్ వల్లే పాపులర్ అయింది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇలా మొదటి సీజన్ మంచి హిట్ అవ్వటంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 ని కూడా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఈ సీజన్లో కూడా రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ లో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా బాలయ్య షోలో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల ఈ సీజన్ 2 కి సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న బాలకృష్ణ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో… ఈ షో లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయా అని విలేకరి ప్రశ్నించగా.. బాలకృష్ణ స్పందిస్తూ… తప్పకుండా ఉంటాయి. వారి ఇష్టం, సమయం అనుగుణంగా తప్పకుండా ఉంటుంది. అంతే కాకుండా వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అన్ స్టాపబుల్ టీం ప్రయత్నం చేయాలి అంటూ సమాధానం ఇచ్చాడు.