బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం.. తమిళ్, తెలుగు బంధమిదే!!

తమిళ తెలుగు భాషలు, ప్రాంతాలు, మనుషుల మద్య అవినాభావ సంబంధం ఉంది. ఒకప్పుడు తెలుగు తమిళ్ ప్రజలు కలిసే ఉన్నారు. అక్కడి సంప్రదాయాలు ఇక్కడి సంప్రదాయలు కూడా ఇంచుమించు కలిసిపోయాయి. కానీ కాలక్రమేణా తమిళంకు ఓ ప్రత్యేకత ఏర్పడింది. తెలుగుకు ప్రత్యేకత ఏర్పింది. రాష్ట్రాలు వేరయ్యాయి. కానీ కళల పరంగా తమిళ్, తెలుగును విడదీయలేం. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు, తమిళ ఇండస్ట్రీకి మధ్య ఎంతో విడదీయలేని అనుబంధం ఉంది.

సినీ ఇండస్ట్రీ హైద్రాబాద్‌కు రాకముందు అంతా చెన్నై కేంద్రంగా జరిగేది. బిగ్ బాస్ షో కూడా ఒకే ఏడాది ప్రారంభించారు. తమిళ్‌లో నాల్గో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. మన తెలుగు షో కాస్త ముందుగా ప్రారంభమైంది. కాకపోతే తమిళ్ బిగ్ బాస్‌కు ముందు నుంచీ కమల్ హాసన్ హోస్ట్‌గా ఉన్నాడు. మనకు మాత్రం మారుతూ వస్తున్నారు. నేడు కమల్ హాసన్ బర్త్ డే. ఈ సందర్భంగా బిగ్ బాస్ హిస్టరీలోనే సరికొత్తగా ప్లాన్ చేశారు.

రెండు బిగ్ బాస్ షోలను ఇంటర్ లింక్ చేశారు. ఒకే సారి ఒకరి షోలోకి ఇంకొకరు వచ్చారు. రెండో సీజన్‌లో కమల్ హాసన్ నేరుగా గెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సారి మాత్రం ఇలా వర్చువల్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు హోస్ట్‌లు మాట్లాడుకున్నారు. ఇంటి సభ్యులతో కూడా మాట్లాడుకున్నారు. ఇలా రెండు భాషల బిగ్ బాస్ షోను ఒకే వేదికపై చూడటంతో ఎంతో కొత్తగా ఆనందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.