బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ఎలిమినేషన్ ప్రక్రియపై అందరికీ అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరిని రక్షించేందుకు ఇంకొందరిని బలి చేస్తున్నారని ఇట్టే తెలిసిపోతోంది. మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. మెహబూబ్‌ను సేవ్ చేసేందుకు దేవీ నాగవల్లిని బలి చేశారని సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. మొదటగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని లీకులు వచ్చినా చివరకు దేవీ నాగవల్లిని బయటకు పంపించారు.,
ఆక ఆరో ఎలిమినేషన్‌లోనూ మోనాల్‌ను సేవ్ చేసేందుకు కుమార్ సాయిని బలి చేశారని, మళ్లీ ఏడో ఎలిమినేషన్‌లో మోనాల్‌ను సేవ్ చేసేందుకు దివిని ఇంటి నుంచి బయటకు పంపించారని గుసగుసలు వినిపించాయి. ఈ నాల్గో ఎలిమినేషన్ ప్రక్రియపై అందరూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ షోను చూడటం ఎందుకు ఓట్లు వేయడం ఎందుకు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఓ క్లారిటీ ఇచ్చేందుకు స్వయంగా నాగార్జున నోటి నుంచి ఓ ప్రకటన వచ్చేలా చేశాడు. ఎలిమినేషన్ ప్రక్రియ అనేది పూర్తిగా ఓట్లను బట్టే జరుగుతుంది, ప్రేక్షకులు వేసిన ఓట్లన్నీ థర్డ్ పార్టీ క్రోడీకరిస్తుందని, అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తామని నాగార్జున తెలిపాడు. అయితే ఇలా నాగార్జున చెప్పిన దాన్ని ఎంత మంది నమ్ముతారో మరి.