హీరోకి ప్రపోజ్ చేసిన బిగ్ బాస్ సత్య… నంబర్ బ్లాక్ చేసి లవ్ రిజెక్ట్ చేసిన హీరో…?

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఎంతోమంది ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని మంచి గుర్తింపు పొందారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకొని బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం తగ్గించుకున్న నటి సత్య శ్రీ . బొల్లితెర మీద ప్రచారం మాత్రమే గుర్తింపు పొందిన సత్య బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకుంది. అయితే సత్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో సత్య మాట్లాడుతూ.. దేవదాస్ సినిమా సమయం నుండి హీరో రామ్ అంటే తనకి ఎంతో ఇష్టమని… ఒక సందర్భంలో చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే రక్తాన్ని వృధా చేయటం ఇష్టం లేక ఆ రక్తంతో హీరో రామ్ పేరుని రాసినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తికి రాఖి కట్టినందుకుగాను హీరో రామ్ నెంబర్ గిఫ్ట్ గా ఇచ్చాడని.. ట్రూ కాలర్ జిమెయిల్ లో నంబర్ చెక్ చేసి అది హీరో రామ్ నెంబర్ అని కన్ఫామ్ చేసిన తర్వాత ఆ నెంబర్ కి
ఐ లవ్ యు అని మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చింది.

అయితే ఆ మెసేజ్ చూసుకున్న హీరో రామ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఈ సందర్భంగా వెల్లడించింది. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోకి అడుగుపెట్టిన సత్య ఎప్పుడు తిండి మీద ధ్యాస పెట్టి తిండిపోతుగా గుర్తింపు పొందింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకోవడంతో సత్య మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ షో వల్ల వచ్చిన పాపులారిటీతో సత్య సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుందో? లేదో? చూడాలి మరి.