బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభమయ్యేది అప్పుడేనా.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన ఆహా!

ఆహా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇప్పటికే ఎన్నో టాక్ షోలు సింగింగ్ కాంపిటీషన్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నటువంటి ఆహా ఇదివరకే బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని నిర్వహించింది.బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ కార్యక్రమ సీజన్ 2 నిర్వహించాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటివరకు ఆహా నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా ఆహా అధికారకంగా అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి క్రేజీ అప్డేట్స్ విడుదల చేశారు. అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సీజన్‌-2ను ప్రారంభం అవుతుందని, దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ షోపై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. పండుగ మొదలయ్యేది అప్పుడే అంటూ క్యాప్షన్ కూడా ఇస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

ఇలా ఆహా గురించి క్రేజీ అప్డేట్ రావడంతో అభిమానులు సైతం కచ్చితంగా ఈ కార్యక్రమం దసరా నుంచి ప్రసారం కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.అయితే త్వరలోనే ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇక మొదటి సీజన్లో ఈ కార్యక్రమానికి ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు హాజరయ్యారు అలాగే చివరిగా మహేష్ బాబు హాజరయ్యారు.అయితే ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే మరి ఎవరు మొదటి గెస్ట్ గా రాబోతున్నారు అనే విషయంపై కూడా ఆత్రుత నెలకొంది.