గెటప్ శ్రీనుని మించిపోయిన అన్నపూర్ణమ్మ! ఒప్పుకున్న గెటప్ శ్రీను!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ లోని ఫేమస్ కమెడియన్లు బయటికి వెళ్లడంతో జబర్దస్త్ పరిస్థితి కొంచెం తారుమారయింది. ఈ క్రమంలో కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ గురించి జబర్దస్త్ యాజమాన్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో జబర్దస్త్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై స్పందిస్తూ ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లతో పాటు జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు కూడా స్పందించి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో సుధీర్, గెటప్ శ్రీను లపై ఏడుకొండలు, సంచలన కామెంట్స్ చేశాడు. వీరిద్దరూ జబర్దస్త్ కి ఖచ్చితంగా తిరిగి రావాలని వచ్చేలా నేను చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా చాలా కాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉన్న గెటప్ శ్రీను ఇటీవల మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకాలం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న శ్రీను గతవారం ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో మళ్లీ సందడి చేశాడు. జబర్దస్త్ లో శ్రీను ఎంట్రీ ఇవ్వటంతో జబర్దస్త్ కళకళలాడిపోతోంది. మునపటిలాగే మళ్లీ జబర్దస్త్ లో శ్రీను తన గెటప్ లతో సందడి మొదలు పెట్టాడు. జబర్దస్త్ లో వచ్చి రాగానే శ్రీను ఏడుకొండల మీద సెటైర్లు వేస్తూ అతని మేనరిజంతో స్కిట్ చేశాడు. ఇక ఈవారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో కూడా శ్రీను తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. ఈవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలయ్యింది. ఈ ఎపిసోడ్ లో గెటప్ శ్రీను సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తో అందరిని కడుపుబ్బా నవ్వించాడు.

ఇక ఈ ఎపిసోడ్లో రాంప్రసాద్ తో కలిసి చేసిన స్కిట్ లో గెటప్ శ్రీను పోలీస్ ఆఫీసర్ గా కొత్త మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఇక సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ చాలా కాలంగా జబర్దస్త్ లో సందడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అన్నపూర్ణమ్మ ఈ ఎపిసోడ్లో రాంప్రసాద్ స్కిట్లో ఖైదీ పాత్రలో నటించింది. ఇక ఈ ఎపిసోడ్ లో అన్నపూర్ణమ్మ శ్రీనుకి ఏమాత్రం భయపడకుండా అతని మీద సెటైర్లు వేసింది.నా మొహం చూసి మాట్లాడు అని శ్రీను అంటే నీ మొహాన్ని ఎవడు చూస్తాడు చెంబెట్టుకెళ్ళే మొహం నువ్వు అంటూ కౌంటర్ వేసింది. మరొక సందర్భంలో శ్రీను కొట్టబోతే అన్నపూర్ణమ్మ కొంచం ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీంతో శ్రీను ఇన్నాళ్లు నాదే ఎక్కువ అనుకున్నా . కానీ నాకన్నా ఎక్కువే అంటూ అన్నపూర్ణమ్మని అంటాడు. ఇలా శ్రీను తన కన్నా అన్నపూర్ణమ్మ ఎక్కువ క్యారెక్టర్ లో లీనమైపోయి నటిస్తుందన్న భావంతో చెప్పాడు.