ఎయిర్ పోర్ట్ లో అనసూయకు చేదు అనుభవం… చొక్కా చిరిగిందంటు అసహనం?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకొని వైవిద్యమైన పాత్రలలో నటిస్తూ తన నటనతో వెండితెర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇలా ఒక వైపు టీవీ షోలు మరొకవైపు వరస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో అనసూయ తన అందాలతో చేసే రచ్చ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇలా అనసూయ తన అందాలు ఆరబోయటమే కాకుండా సోషల్ మీడియాలో వివాదాస్పదమైన పోస్ట్ లు షేర్ చేస్తూ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల ఆంటీ అని పిలిచిన వారి మీద కేసు పెడతానంటూ అనసూయ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యి వివాదంలో నిలిచింది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

బెంగళూరు నుండి హైదరాబాద్ తిరిగి రావటానికి అనసూయ అలియన్స్ ఎయిర్ సంస్థకు సంబంధించిన ఫ్లైట్ లో టికెట్స్ బుక్ చేసినట్లు వెల్లడించింది. సాయంత్రం 6.55 గంటలకు టేకాఫ్ కావాల్సి ఫ్లైట్ అరగంట డిలే అయిందని ఆ అరగంట పాటు బస్సులో నరకం అనుభవించామని అనసూయ వెల్లడించింది. అంతేకాకుండా ఫ్లైట్ వచ్చిన తర్వాత బస్సు నుండి ఫ్లైట్ లోకి వెళ్ళబోతుండగా మాస్క్ లేదని సెక్యూరిటీ తనని బయటే ఆపినట్లు చెప్పుకొచ్చింది. అనసూయ తన కుటుంబ సభ్యులందరికీ ఒకే చోట టికెట్స్ బుక్ చేయగా.. సిబ్బంది మాత్రం ఒక్కొక్కరిని ఒక్కోచోట కూర్చోబెట్టినట్లు వెల్లడించింది. అంతేకాకుండా విమానంలో సీట్లు కూడా సరిగా లేకపోవటంతో తన షర్ట్ కూడా చిరిగింది అంటూ ఫ్లైట్ లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ అలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ సర్వీస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.