బిగ్ బాస్ 4 లో అత్యంత నెగటివ్ ఇమేజ్ సంపాదించుకున్న వారిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఒకరు.
సీజన్ ప్రారంభంలో అమ్మ రాజశేఖర్ చాల సరదాగా ప్రేక్షకులని బాగా అలరించాడు. కాని సీసజోన్ ప్రారంభమైన నాలుగైదు వారాల్లో అతని స్వభావం చాలా మారిపోయింది. అతనిని నామినేట్ చేసిన లేదా అతని లోపాలను ఎత్తిచూపే హౌస్‌మేట్‌లను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించాడు.
బిగ్ బోస్ కెమెరాల్లో ఎక్కువ కనిపించడం కోసం కొంచెం శృతిమించి వేషాలు వెయ్యడం ప్రారంభించడంతో ప్రేక్షకులకి అమ్మ రాజశేఖర్ మీద ఆసక్తి తగ్గిపోవడం మొదలైంది.
తన వెర్రి వ్యూహాలతో కొంతమంది మంచి ఆటగాళ్లను ప్రభావితం చేసి వారు ఇంటినుండి నిష్క్రమించడానికి అతను కూడా ఒక కారణమనే చెప్పాలి. దివి, అరియనా గ్లోరీ ఆ కోవకు చెందిన వారే.
అమ్మ రాజశేఖర్ కు బిగ్ బోస్ చాలా సహాయం చేసాడనే చెప్పాలి. బిగ్ బాస్ యాజమాన్యం సహాయం లేకపోతే అమ్మ రాజశేఖర్ చాలా ముందుగానే నిష్క్రమించాల్సిన ఆటగాడు.
బిగ్ బాస్ యొక్క క్రియేటివ్ బృందం అమ్మ రాజశేఖర్ వాళ్ళ షో కి టీఆర్పీ పెరుగుతుందని భావించడం వలెనే అతనికి ఇంత దూరం రావడానికి అదనపు అవకాశాలు ఇచ్చారు.
ఆరోగ్య సమస్యల కారణంగా నోయెల్ బయటకు వెళ్ళకపోతే అమ్మ రాజశేఖర్ గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు. బిగ్ బాస్ అతన్ని ఇంటి కెప్టెన్‌గా మార్చడానికి తమ వంతు కృషి చేసినప్పటికీ, అతన్ని నామినేట్ కాకుండా ఆపలేకపోయారు.
అందరూ ఊహించిన విధంగా, అమ్మ రాజశేఖర్ ఈ వారంలో అతి తక్కువ ఓట్లను పొందండంతో ఈ ఆదివారం బిగ్ బాస్ ఇంటినుండి నిష్క్రమించనున్నారు.
అమ్మ రాజశేఖర్ నిష్క్రమణ ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కానుంది.