వదిలేస్తే వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెడతారు… ఆ నటుడిపై యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా బుల్లితెరపై వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మీ వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే రష్మీ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఏవి తనకు సరైన స్థాయిలో గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి. ఇకపోతే రెండు సంవత్సరాల క్రితం సింగర్ గీతామాధురి భర్త నటుడు నందుతో కలిసి ఈమె బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నందు ఒక ఫ్రాంక్ వీడియో చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ ఫ్రాంక్ వీడియోలో భాగంగా ప్రమోషన్లకు రావడానికి రష్మీ అసలు ఏమాత్రం ఇష్టపడరని ఆమె ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఒక ఫ్రాంక్ వీడియో చేశారు.అయితే ఈ వీడియో పై రష్మి స్పందిస్తూ వారు ఫ్రాంక్ చేసిన నేను చెప్పిన సమాధానం మాత్రం నిజమే చెప్పానంటూ క్లారిటీ ఇచ్చారు.

అసలు తనకు ప్రమోషన్ కి రావాలని ఇంటిమేట్ చేయకుండా అప్పటికప్పుడు రావాలి అంటే నేను కూడా నా షెడ్యూల్స్ చూసుకోవాలి కదా? ఇలా ప్రమోషన్లకు రాలేదని వేరే షెడ్యూల్స్ లో ఉంటే సరాసరి అక్కడికే వస్తారా? వీరిని వదిలేస్తే ఏకంగా నా వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టేలాగే ఉన్నారు అంటూ నటుడు నందు పై రష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.