యూట్యూబ్‌లో శృంగార తారగా పేరుతెచ్చుకుని, తెలుగు సన్నీ లియోన్‌గా వెలిగిపోతోంది స్వాతి నాయుడు. గతంలో పోర్న్ మూవీస్‌లో నటించడానికి సిద్ధమంటూ ప్రకటించిన స్వాతి యూట్యూబ్ లో హాట్ వీడియోలతో సిద్దంగా ఉంటుంది. తాజాగా ఆమె వివాహం చేసుకుంది. విజయవాడలో సంప్రదాయబద్దంగా వైభవంగా ఈ వివాహం జరిగింది.
అయితే స్వాతి నాయుడు ఏంటి పెళ్లి చేసుకోవటం ఏంటి అని చాలా మందికి డౌట్..దాంతో ఈ వార్తను చాలామంది నెటిజన్లు నమ్మలేదు. దాంతో ఆమే స్వయంగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తన పెళ్లి వివరాలను వెల్లడించింది.
తన భర్త మరియు బంధువులను పరిచయం చేసిందామె. తన భర్త పేరు అవినాష్ అని, తామిద్దరికీ ఫిబ్రవరి 23వ తేదీ అర్థరాత్రి 12.19 గంటలకు పెద్ద సమక్షంలో వివాహం జరిగినట్లు వెల్లడించింది. వివాహం అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న తనకు అందరి ఆశీస్సులు కావాలని కోరింది.
సినీ రంగంలో నటిగా ఎదగాలనే కోరికతో వచ్చిన స్వాతినాయుడుకి కి వెండితెరలో, బుల్లితెరలో ఎక్కడా అవకాశాలు రాలేదు. పోనీ బ్లూఫిల్మ్స్ చేయాలని ఉన్నా, ఇండియాలో పుట్టడం వలన సాధ్యం కావడం లేదని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది. తర్వాత యూట్యూబ్‌ను ఎంచుకుని అందులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్వాతి పెళ్లయ్యాక కూడా మరి తన హవాను కొనసాగించే వీడియోలు అందిస్తుందో లేదో చూడాలి మరి.