ఇప్పుడంటే స్టార్ హీరోయిన్ కానీ ఒకప్పుడు అల్లరి గడుగ్గాయే కియరా అద్వాణీ. ముఖ్యంగా చిన్నప్పుడు కియరా ఎంత అల్లరల్లరిగా ఉండేదో ఇదిగో ఈ వీడియోలు చూస్తేనే అర్థమవుతోంది. వెండితెరపై కనిపించినంతసేపూ ఎంతో ఎనర్జిటిక్ గా చెలరేగిపోతున్న కియరాలో ఈ ఎనర్జీ ఇప్పటిది కాదు. చిన్నప్పటి నుంచి తాను ఎంతో వైబ్రేంట్ అని ఈ వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి.
ఒక వీడియోలో కియరా చిన్నారిగా ఉన్నప్పుడు భరత నాట్యం ప్రాక్టీస్ చేస్తోంది. అది భరతనాట్యమా? బాలీ డ్యాన్సా? అంటూ మామ్ తెగ ఆట పట్టించేస్తుంటే ఏం చేసిందో చూసి తీరాల్సిందే.
ఎం.ఎస్.ధోని – యాన్ అన్ టోల్డ్ స్టోరి- భరత్ అనే నేను చిత్రాల్లో నటించినప్పుడు కియరా మరీ డీసెంట్ అనే అనుకున్నారంతా. కానీ ఆ రెండు సినిమాల సక్సెస్ తర్వాత తనలోని మరో కొత్త కోణం బయటపడింది. అంతకుముందే లస్ట్ స్టోరీస్ లో వేడెక్కించే వయ్యారాల వడ్డనలతో లిప్ లాక్ లతో చెలరేగిన కియరా ఎందులోనూ తగ్గదని అర్థమైంది. ఆ తర్వాత మరోసారి వెబ్ సిరీస్ వేదికగా చెలరేగి నటించి టాప్ లేపేసిన కియరాని చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి స్టఫ్ కోసమే టాలీవుడ్ ఎప్పుడూ వెయిట్ చేస్తుంటుంది. ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా ముంబై భామల్లో కియరాకే ప్రయారిటీనిస్తున్నారు. పూజా హెగ్డే తర్వాత తనకే ఆఫర్లు వెళుతున్నా.. కియరా మాత్రం వరుసగా అరడజను సినిమాలతో బాలీవుడ్ లో బిజీగా ఉంది. అసలు ముంబై పరిశ్రమను వదిలి రాలేనంటోంది. గత కొంతకాలంగా కిడ్ గా ఉన్నప్పుడు తన అల్లరి వేషాల్ని ఇన్ స్టాలో రివీల్ చేస్తోంది కియరా. ఆ వీడియోలు ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి.
