అతనో యాంగ్ హీరో. ఒక్క సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్ కి రీచ్ అయ్యాడు. అనూహ్యంగా దక్కిన విజయమది. ఒక్క విజయం పేరుకు పేరు..డబ్బుకు డబ్బు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఆ హీరో కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. దీంతో ఆ హీరో అంటే యంగ్ హీరోయిన్లంతా ఇష్టపడటం మొదలు పెట్టారు. రీసెంట్ గా స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చిన భామలంతా ఆ హీరోపైనే మనసు పడుతున్నారు. ఈ జాబితాలో ఓ ప్రముఖ నటి కుమార్తె కూడా ఉంది. టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా! ఎందుకనో ఆలోచిస్తుంది. ఏ హీరో క్రష్ అంటే? నిర్మొహమాటంగా అతనంటే క్రష్ ఏంటి? అంతకు మంచి అంటూ పబ్లిక్ గానే చెప్పేస్తున్నారు.
ఈ విషయాలు హీరోగారి చెవిన పడిన ఏమో! అవన్నీ నాకు తెలియవంటూ ఎస్కేప్ అవుతున్నాడు. తాజాగా ఆ హీరో చాటు మాటుగానే అన్నింటినీ చుట్టేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. తనని ఇష్టపడిన హీరోయిన్లందరితోనూ ఎఫైర్లు నడుతుపుతున్నాడని ఆ కాంపౌండ్ లో ఒకటే గోల. ఎవరికీ తెలియకుండా ముంబై వెళ్లి రావడం….రహస్యంగా కలిసి రావడం వంటివి చేస్తున్నాడుట. రెగ్యులర్ గా ఆ భామా మణులందరికీ టచ్ లో ఉంటున్నాడుట. గంటల కొద్ది ఫోన్లో మాట్లాడుతున్నాడుట. అతని ఫోన్ చెక్ చేస్తే ఆ హీరోయిన్లతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు కూడా ఉన్నాయంటున్నారు.
కెరీర్ పై ఇలాంటివి నెగిటివ్ కాకుండా అంతే జాగ్రత్త పడుతున్నాడుట. బయటకి ఎవరికి అనుమానం రాకుండా మసులుకుంటు న్నాడుట. అతన్ని క్లోజ్ గా వాచ్ చేస్తున్న వాళ్లు..సన్నిహితంగా మెలిగే వారి నుంచే ఈ విషయాలు లీకయ్యాయి. ఈ విషయంలో ఆ హీరో స్నేహితులు అదుపు తప్పితే పరిస్థితి ఏంటి? అని కంగారు పడుతున్నారుట. బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలపై ఇలాంటి మచ్చ ఒక్కసారి పడితే దాన్ని చెరుపుకోవడం అంత ఈజీ కాదు. పరిశ్రమలో సుఖాలకు అలవాటు పడి స్టార్ స్టేటస్ కోల్పోయిన హీరోలెంతో మంది ఉన్నారు. అవన్నీ చూసిన ఆ హీరో స్నేహితులు అతని ప్రోఫెషనల్ కెరీర్ కే ప్రమాదకరమని కంగారు పడుతున్నారుట. హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నా అతను పెడ చెవిన పెడుతున్నట్లు టాక్ . ప్రస్తుతం ఆ హీరో ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. ఇంకా చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్ లున్నాయి.
