అలాంటి సినిమాలు అయితే చెయ్యను అంటున్న “ఉప్పెన” బ్యూటీ..!

Bebamma Krithi Shetty

టాలీవుడ్ లో కానీ సౌత్ ఇండియన్ సినిమా దగ్గర కానీ జస్ట్ ఒక్క సినిమా అందులో కూడా తమ ఫస్ట్ సినిమా తోనే సెన్సేషన్ ని రేపే యంగ్ హీరోయిన్స్ చాలా మందే పరిచయం అవుతూ ఉంటారు. మరి అలాగే మన టాలీవుడ్ లో పరిచయం అయ్యిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.

“ఉప్పెన” అనే సినిమాతో తన కెరీర్ లో ఏ హీరోయిన్ కూడా అందుకొని డెబ్యూట్ హిట్ ని సొంతం చేసుకున్న ఆమె తెలుగులో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక దాన్ని మించి ఒక సూపర్ హిట్ సినిమాతో దూసుకెళ్తున్న తాను లేటెస్ట్ గా నటించిన చిత్రం నితిన్ తో “మాచర్ల నియోజకవర్గం” ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కెరీర్ విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తన కెరీర్ పరంగా అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తాను చెయ్యనని ఓపెన్ గా చెప్పేసింది. అలాంటి సినిమాలు దాదాపు నో అనే చెప్తానని ఎందుకంటే ఈ సినిమాలు చాలా బాధ్యతతో కూడుకున్నవి అని అందుకే ఆ సినిమాలు దాదాపు చెయ్యకుండా ఉండేందుకే చూస్తానని చెప్పింది.

అయితే ఒకవేళ చెయ్యాల్సి వస్తే.. డైరెక్టర్స్ నన్ను కానీ కన్విన్స్ చేసేలా కథను నరేట్ చేసే మాత్రం ఆలోచిస్తానని అసలు విషయం చెప్పింది. మొత్తానికి అయితే ఈ యంగ్ బ్యూటీ తన కెరీర్ లో బాగానే క్లారిటీగా ఉంది. అలాగే ఇలాంటి స్టేట్మెంట్ ఓపెన్ గా చెప్పడం కూడా మంచిదే..