ఐటెం సాంగ్స్ చేస్తాను అంటున్న టాప్ హీరోయిన్

ప్రత్యేక గీతాలకు వెనుకాడను!

జనతా గ్యారెజ్‌లో నేను  పక్కాలోకల్‌..  అంటూ ఓ ఊపు ఊపిన అందాల భామ కాజల్‌ అగర్వాల్‌  మరో సారి ఓ స్పెషల్‌ సాంగ్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.  కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎవ్వరికి అర్థం కాదు. ఆమె హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆలోచింప చేస్తాయి.. సినిమాలో హీరోయిన్‌గా వచ్చే క్రేజ్‌ కంటే.. ఒక్క ఐటెంసాంగ్‌తో వచ్చే స్టార్‌డమ్‌ ఎక్కవ.

అందుకే మన టాలీవుడ్‌లో ఈ గీతాలది ప్రత్యేక స్థానం. తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ ప్రత్యేక గీతాలతో మాస్‌ను ఆకట్టుకున్నారు. స్టార్‌ హీరోయిన్లు ఐటెంసాంగ్‌ చేస్తున్నారంటే మరింత స్పెషల్‌గా డిజైన్‌ చేస్తారు మేకర్స్‌. మాస్‌ను ఆకట్టుకునే ఈ పాటలతో నటించే హీరోయిన్లకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది.   స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రంలో కాజల్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్పెషల్‌ సాంగ్‌ గురుంచి కాజల్ ను కదిలిస్తే… తన మనసులోని మాటలను ఎలా చెప్పుకొచ్చింది.. స్పెషల్‌ సాంగ్‌ అంటేనే వాటిని మరో రకంగా చూస్తారెందుకు? వాటికున్న ప్రత్యేకత వాటికుంది. సినిమా విజయంలో అవి భాగమవుతున్నాయి. జనతా గ్యారెజ్‌లో నేను  పక్కాలోకల్‌.. అంటూ చేసిన గీతం నాకు ఎంతటి పేరు తెచ్చిందో తెలియంది కాదు.  నేను ఇలాంటి పాటల్లో నటించడానికి ఎప్పుడూ వెనుకాడను అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్ కాజల్ అగర్వాల్