చిరంజీవి, విజయ శాంతి ప్రచారం చేస్తారా ..?

తెలంగాణాలో ఎన్నికలు వేడెక్కుతుంటే కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ చిరంజీవి మాత్రం తన 151వ సినిమా సైరా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ బిజీ లో వున్నాడు .చిరంజీవి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తాడా? లేదా అనే విషయంలో స్పష్టత రాలేదు . చిరంజీవికి వున్న మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సభల్లో ప్రసంగించేలా చూడాలని కొంత మంది నాయకులూ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది . తెలుగు సినిమాలో నందమూరి తారక రామ రావు తరువాత అంతటి ప్రజాదరణ సంపాదించుకున్నాడు . టీఆరెస్ పార్టీని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం , సీపీఐ , తెలంగాణ జన సమితి పార్టీలతో జట్టు కట్టింది . రాములమ్మ విజయ శాంతి ఎలాగూ ప్రచారం చేస్తుంది . ఆమెతో పాటు చిరంజీవిని కూడా దించితే ఫలితాలు తమకు అనుకూలంగా వుంటాయని కొందరు నమ్ముతున్నారు .

ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2008లో ప్రారంభించి 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు . కాంగ్రెస్ పార్టీ ఆయనను 2012 ఏప్రిల్ 3న రాజ్య సభ సభ్యుడుగా ఎంపిక చేసింది . 27 అక్టోబర్ 2012న కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమించింది . 2014 మే వరకు ఆయన మంత్రిగా పనిచేశాడు . రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి నోరు మెదపలేదు . రాజ్య సభ సభ్యుడుగా వున్నానని ఆయన మర్చిపోయాడు . ఆ తరువాత ఒకటి రెండు సందర్భాల్లో తప్ప కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొనలేదు .

రాజకీయాలను పక్కన పెట్టి మళ్ళీ సినిమా రంగంలోకి దూకేశాడు . 150 వ సినిమా “ఖైదీ నెంబర్ 150” సినిమా చేశాడు . ఆ సినిమా విజయ వంతం కావడంతో 151వ సినిమా సైరా నరసింహారెడ్డి షూటింగ్ మొదలు పెట్టాడు . బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, నయన తార లాంటి వారితో తానే స్వంతంగా నిర్మిస్తున్నాడు . అదీకాక మొన్న ఏప్రిల్ 2 తో రాజ్య సభ సభ్యుడుగా పదవి కాలం అయిపొయింది . కాబట్టి కాంగ్రెస్ పార్టీ తో ఈరకమైన బంధం లేదు . ఇప్పుడు రాజకీయ నాయకుడుగా కొత్తగా సాధించేది ఏమిలేది . తాను ప్రచారం చెయ్యడం వల్ల వేరేవాళ్లు లాభ పడ వచ్చు తప్ప తనకు ఒరిగేది ఏమిలేదు . అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరంగా తన కిష్టమైన సినిమారంగంలో గడుపుతున్నాడు . కాబట్టి చిరంజీవి తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం లేదు . ఇక ఆయన రాజకీయ ప్రస్థానం కు ఫుల్ స్టాప్ పడ్డట్టే !