త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా ఎపుడు?

సంక్రాంతి సీజ‌న్ సినిమాల‌లో ఏది బెస్ట్? అంటూ హోరా హోరీ క‌నిపిస్తోంది. అల వైకుంఠపుర‌ములో- స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాల మ‌ధ్య‌నే అస‌లైన పోటీ.. అయితే ఈ పోటీపై త్రివిక్ర‌మ్ ఏమ‌న్నారు? అలాగే రాజ‌మౌళి- సురేంద‌ర్ రెడ్డి త‌ర‌హాలో పాన్ ఇండియా ప్ర‌య‌త్నాలు ఎపుడు? అంటే ఆయ‌న ఇచ్చిన ఆన్స‌ర్ స‌ర్ ప్రైజింగ్ అనే చెప్పాలి.

సంక్రాంతి రిలీజ్ ల‌పై త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ.. సంక్రాంతి సీజన్లో అన్ని సినిమాలకు డిమాండ్ ఉంటుంది. అలాగే అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు రెండు చిత్రాల ట్రైలర్స్ చూశాను. ఇవి రెండు భిన్న జోనర్స్ కి చెందిన చిత్రాలు. కాబట్టి ఒకదానికొకటి పోటీకాదు అని తెలిపారు. పాన్ ఇండియా మూవీ ఎప్పుడు చేస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా..  ప్రస్తుతానికి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే కథ నాదగ్గర లేద‌ని .. అలాంటి కథ నాకు దొరికినప్పుడు ఖచ్చితంగా హిందీతో పాటు, పలు భాషలలో ఆ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తానని తెలిపారు.