‘మన్మథుడు 2’ యూఎస్ కలెక్షన్స్ పరిస్దితి

 
‘మన్మథుడు 2’ యూఎస్ కలెక్షన్స్ పరిస్దితి

 కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9విడుదలైన సంగతి తెలిసింమదే. సుమారు 17 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా ఈ ‘మన్మథుడు 2’ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘చి.ల.సౌ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మన్మధుడు 2 కి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది.

యూఎస్ 150 పైగా లొకేషన్లలో మన్మధుడు 2 విడుదలైంది . ప్రీమియర్స్ షోస్ ద్వారా $82,190 వసూళ్లతో నాగ్ కెరియర్‌లో బెస్ట్ సోలో గ్రాసర్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత నుంచే వసూళ్లు చాలా తక్కువ నమోదు అవుతున్నాయని తెలుస్తుంది. అమెరికాలో విడుదలైన మొదటిరోజు గురువారం,చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం శుక్రవారం నుండే బాక్సాపీస్ వద్ద డీలాపడినట్టు సమాచారం. రివ్యూలు వచ్చేయటంతో సినిమా టాక్ స్ర్పెడ్ అయ్యి..కలెక్షన్స్ ఆటోమేటిక్ గా డ్రాప్ అయ్యిపోయాయి.

ఈ చిత్రం ప్రీమియర్స్ తో కలుపుకొని రెండు రోజులకు గాను $1,93,651 వసూళ్లు సాధించింది. ఇక మిగిలిన సెలవు దినం ఆదివారం అయినా మన్మధుడు 2 వసూళ్లలో పెద్ద మార్పేమీ లేదు. మరో ప్రక్క నాలుగు రోజులలో రణరంగం,ఎవరు వంటి చిత్రాల విడుదల నేపథ్యంలో మన్మధుడు 2 కలెక్షన్స్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.