వాలీబాల్ చాంపియన్ అరికపూడి రమణారావు బయోపిక్ తెరకెక్కనుందా? అంటే అవుననే ప్రచారం అవుతోంది. నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలకు రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్టును రెడీ చేస్తున్నారట. అతడు త్రినాథరావు నక్కినతో కలిసి పని చేశారు. ఆ క్రమంలోనే బయోపిక్ కథాంశాన్ని రెడీ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వాలీబాల్ క్రీడ అంటే ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా అని అర్థమవుతోంది. స్క్రిప్టు రెడీ అయ్యాక పలువురు నిర్మాతలను కలిసి వర్కవుట్ చేయాలన్నది ప్లాన్. ప్రస్తుతం రవితేజ మరియు త్రినాథరావు నక్కినలతో చేయనున్న ఓ ప్రాజెక్ట్ కు పని చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. హిస్టారియన్ అయిన అరికపూడి కథ బయోపిక్ కి ఏమేరకు సూటబుల్? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
అరికాపుడి రమణారావు (జననం 1 జూలై 1945) మాజీ భారత వాలీబాల్ క్రీడాకారుడు. అతను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని చమల్లముడి గ్రామంలో జన్మించారు. 1977-1978 సంవత్సరానికి అర్జున అవార్డును, 1990-1991 సంవత్సరానికి ద్రోణాచార్య అవార్డు రెండింటినీ అందుకున్నారు.
రమణారావు కాలేజీలో వాలీబాల్ ఆటలో రాణించారు. అతను 1966 లో గుంటూరులోని హిందూ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1966 నుండి 1976 వరకు అతను జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఎన్నో పతకాల్ని గెలుచుకున్నారు.యు తమిళనాడు రాష్ట్ర జట్టును వరుసగా నాలుగు సంవత్సరాలు కెప్టెన్‌గా నడిపించారు. 1976 లో తిరుచిరాపల్లిలో తొలిసారిగా జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న తమిళనాడు రాష్ట్ర జట్టు తరఫున ఆడాడు.
1991 లో పెర్త్‌లో జరిగిన ఆసియా పురుషుల వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల వాలీబాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేసారు. 1986 లో జర్మన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్‌లో ఎఫ్‌ఐవిబి బోధకుడిగా అర్హత సాధించిన తొలి భారతీయ వాలీబాల్ కోచ్ గా ఘనుతికెక్కారు. అటుపై అంతర్జాతీయ కోచ్ గానూ పని చేసారు. 1993-1997 నుండి ఆసియా వాలీబాల్ కాన్ఫిడరేషన్ (AVC) లో సభ్యుడిగా కొనసాగడమే గాక AVC కోచ్స్ కమిటీ సభ్యుడిగా నామినేట్ అయ్యాడు.
అనంతర కాలంలో చెన్నైలోని ఎఫ్‌ఐవిబి ప్రాంతీయ అభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌గా రమణారావు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతను వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ (కోచింగ్ కమిటీ) గానూ కొనసాగుతున్నారు. ఇంత పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఆయనపై బయోపిక్ తీస్తే ఆసక్తిని కలిగిస్తుందనడంలో సందేహమేం లేదు. క్రీడా బయోపిక్ లు స్ఫూర్తి నింపేలా ఎమోషనల్ గా తీర్చి దిద్దేపనితనం దర్శకుడిలో ఉండాలి అంతే.