‘జెర్సీ’పై విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్

నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని…. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. సినిమా ఎంతో గొప్పగా ఉందని సినీ స్టార్స్‌ కూడా ట్వీట్లు చేశారు. ఈ చిత్రంలో నేచురల్‌ స్టార్‌ క్రికెటర్‌గా కనిపించి, మెప్పించారు. తాజాగా విజయ్ దేవరకొండ ‘జెర్సీ’ మూవీ విజయంపై స్పందించారు. ఈ సినిమాను తాను ఎంత ఇష్టపడ్డారో ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. నాని గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి.

‘ఈ చిత్రం చూస్తుంటే.. నానిపై ఎంతో ప్రేమ కలిగింది. క్రికెటర్ అర్జున్ క్లాప్ కొట్టించాడు. సినిమాలో లీనం అయ్యేలా చేశాడు.. హిట్టింగ్‌‌తో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చాలా టాలెంటెడ్ దర్శకుడు అనడానికి ఈ సినిమా చాలు. జెర్సీ ప్రేమలో… ఓ గమనిక: నాని హైదరాబాద్‌ సన్ రైజర్స్‌‌కి ఆడొచ్చు.. స్ట్రైకింగ్ అదరగొట్టేశాడు’ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ. కాగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నో వేల మంది రీట్వీట్ చేస్తున్నారు, లైక్స్ వస్తున్నాయి.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నిఖిల్, మంచు మనోజ్ లాంటి సెలబ్రిటీలు నాని ఎమోషనల్ హిట్టింగ్‌కి ఫిదా అవుతుంటే ‘జెర్సీ’లాంటి చక్కటి సినిమా కోసం పనిచేసిన వారందర్నీ ప్రశంసించడం అవసరమని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ అధినేత దిల్‌రాజు అభిప్రాయపడ్డారు.