పవన్ “ఖుషి”, తన “ఖుషి” సినిమాపై విజయ్ దేవరకొండ కీలక కామెంట్స్.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ మూవీ “లైగర్”. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ భారీ ఏక్షన్ చిత్రం “లైగర్” మాసివ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో అయితే విజయ్ అన్ని భాషల్లో  పాల్గొంటుండగా లేటెస్ట్ గా తెలుగులో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “ఖుషి” విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. తెలుగు ఆడియెన్స్ కి కళ్యాణ్ గారు చేసిన ఖుషి సినిమా ఒక ఎమోషన్ లాంటిది అని ఆ టైటిల్ తో నేను ఖుషి సినిమా చేయడం  కాదని..

అయితే ఆ జెనరేషన్ లో ఆ చిత్రం ఎంత ముఖ్యమో ఎంత హిట్టయ్యిందో ఇప్పుడు ఈ జెనరేషన్ లో ఈ “ఖుషి” కూడా అంత మంచి విజయం సాధిస్తుంది అని తెలిపాడు. అంతే కాకుండా ఆ సినిమాని పేరుని పోగొట్టేలా ఈ సినిమా అయితే ఎక్కడా ఉండదని విజయ్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.

ఇంకా ఈ సినిమాలో అయితే స్టార్ హీరోయిన్ సమంత మరోసారి విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ గా నటిస్తుండగా టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టుగా భోగట్టా..