‘వెంకీ మామ’ మేకింగ్ వీడియో చూశారా?

‘వెంకీ మామ’ మేకింగ్ వీడియో చూశారా?

నిజ జీవిత మేనమా…మేనల్లుడు అయిన వెంకటేష్‌, నాగచైతన్య తొలిసారి కలసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో దర్శకుడు బాబి పుట్టిన రోజుని పురస్కరించుకుని టీమ్ …మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది.

Venky Mama Pre Teaser | Happy Birthday Bobby | Daggubati Venkatesh, Akkineni Naga Chaitanya

సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల మాట్లాడుతూ ‘‘ వెంకీ, చైతూల మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వాళ్లిద్దరితో తెరకెక్కించిన సన్నివేశాలు ఆద్యంతం అలరిస్తాయి. వినోదంతో పాటు అన్నిరకాల భావోద్వేగాల్నీ మేళవించాం’’ అన్నారు.

వెంకీమామ చిత్రాన్ని సురేశ్‌ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై సురేశ్‌బాబు నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. పల్లెటూరి నేపథ్యంతో పాటు, ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లోనూ సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తే అర్థమవుతోంది. మరీ తెరవెనుక నిజమైన మామ-అలుళ్లు తెరపై ఎలా సందడి చేస్తారో చూడాలి. డి.సురేష్‌బాబు, విశ్వప్రసాద్‌ నిర్మాతలు. సంగీతం: తమన్‌