‘వెంకీమామ’ ని కాన్సిల్ చేసిన సురేష్ బాబు, అసలు కారణం ఇదే?

                                                                     (సూర్యం)

సీనియర్‌ హీరో వెంకటేష్‌, యంగ్ హీరో నాగచైతన్య కాంబినేషన్‌లో రీసెంట్ గా వెంకీ మామ చిత్రాన్ని  ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్..అందుకు తగ్గట్లే..నిజజీవితంలో కూడా మామా అల్లుళ్లైన వెంకీ, చైతూలు ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లుగా నటిస్తారని తెలియటంతో ప్రాజెక్టుపై హైప్ బాగానే క్రియేట్ అయ్యింది. మరో నిర్మాత  అయితే వెంటనే సినిమా మొదలెట్టేసి బిజినెస్ చేసేసేవారు. కానీ సురేష్ బాబు అలాంటివాడు కాదు.

హిట్ అయ్యి డబ్బులు తేవటం తో పాటు…సినిమా బాగుండాలి,కొత్తగా ఉండాలి అని నమ్ముతున్నారు. అందుకు నిదర్శనం ఆయన బ్యానర్ నుంచి వచ్చిన పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం చిత్రాలే. కథ,కథనాల్లో ఏదో ఒక వైవిద్యం ఉండాలని నమ్మి అలాంటి కథలనే ఓకే చేస్తున్నారు. అదే పద్దతి తన సోదురడు వెంకటేష్ సినిమాకు సైతం ఫాలో అవదలిచినట్లు సమాచారం. అయితే దర్శకుడు బాబీది మొదటి నుంచి ఓ కమర్షియల్ స్కూల్.

రెగ్యులర్ కమర్షియల్ కథలను వండివార్చడం ఆయన పద్దతి. ఆయన కథలు ఇచ్చిన సినిమాలు కానీ , డైరక్ట్ చేసిన సినిమాలు కానీ ఈ విషయాన్ని చెప్తాయి. అదే పద్దతిలో ఇద్దరు హీరోలను ఎలివేట్ చేస్తూ కథ తయారు చేసి వినిపించాడని, వెంకీ ఓకే చేసేసారని ఎగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అయతే కథ విన్న సురేష్ బాబు..తనకు ఎలా కావాలో చెప్పి మార్పులు సూచించాడని, అలా ఆయన్ని తృప్తి
పరచలేకపోయారని టాక్. గత కొద్దిరోజులుగా దర్శకుడు బాబీ – రచయిత కోన వెంకట్ లు కథపై కూర్చుని సురేష్ బాబుకు ఫైనల్ వెర్షన్ వినిపించారట.

గతంలో కోన వెంకట్ తో పనిచేసిన షాడో దెబ్బతినటంతో…సురేష్ బాబు ఆచి తూచి అడుగులు వేయాలనుకున్నారు. దాంతో తనకు నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ ను పక్కనపెడదామనే నిర్ణయం తీసుకున్నారట.   అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం నాగచైతన్య సవ్యసాచితో పాటు మజిలీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌తో కలిసి ఎఫ్ 2 సినిమా
చేస్తున్నాడు. ఏమో మళ్లీ గుర్రం ఎగరావచ్చు. బాబి కథ నచ్చా వచ్చు. ఎవరు చూడగలరు..