సంక్రాంతి బరిలో ప్రవేశించి రిలీజైన నాలుగో సినిమా `ఎఫ్2- ఫన్ & ఫ్రస్టేషన్`. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్, క్యాప్షన్ కి తగ్గట్టే ఈ చిత్రంలో బోలెడంత ఫన్, ఫ్రస్టేషన్ ఉంటుందని ట్రైలర్ ప్రామిస్ చేసింది. అంతేగా అంతేగా అంటూ ఫ్యామిలీ కంటెంట్ తో సైలెంట్ గా సౌండ్ చేస్తూ ఈ సినిమా వచ్చింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రంకు హిట్ టాక్ వచ్చింది. ట్రైలర్ తో చూపించినట్లుగానే కామెడీ నిజంగానే నవ్వించిందని చూసిన వారు చెప్తున్నారు. సినిమా కథ పాతదైనా కామెడీ సీక్వెన్స్ లు కొత్తగా అనిపించాయని ఇనానమస్ టాక్ వినిపిస్తోంది.
చిత్రం కథలోకి వస్తే..
యూరప్ లో వెంకీ, వరుణ్ ఇద్దరూ అరెస్టుతో మొదలయ్యే ఈ సినిమా ప్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్తుంది. ఎమ్మల్యే రవిబాబు దగ్గర పిఏగా పనిచేసే వెంకి (వెంకటేష్) ఎరేంజ్డెజ్ మ్యారేజ్ ..గా హారిక (తమన్నా)ను చేసుకుంటాడు. కానీ పెళ్లైన దగ్గర నుంచి ఆమె తన తల్లితో కలిసి డామినేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ లోగా ఆ ప్యామిలీలోకి మరొకరు రావటానికి ప్రయత్నిసాడు. అతనే వరుణ్ యాదవ్(వరుణ్ తేజ). వెంకీ మరదలు మెహరిన్ ని ప్రేమించి,పెళ్లాడతాను అంటాడు. తన ఎక్సపీరియన్స్ లు చెప్పినా వినిపించుకోక పెళ్లాడతాడు. దాంతో తోడళ్లుళ్లు ఇద్దరూ కలిసి ప్రష్టేషన్స్ ని షేర్ చేసుకోవటం మొదలెడతారు. ఈ క్రమంలో వాళ్లు తమ విలువ తెలియాలని యూరప్ కు చెప్పా పెట్టకుండా జంప్ అయ్యిపోతారు. అప్పుడు వాళ్ల భార్యలేం చేసారు అన్న కోణంలో సెకండాఫ్ జరుగుతుంది.
ఓవరాల్ గా .. ఈ సంక్రాంతి బరిలో అంతేగా అంతేగా అంటూ ఫ్యామిలీ కంటెంట్ తో సైలెంట్ హిట్ కొట్టినట్లే అనిపిస్తోంది. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ తర్వాత వెంకీ పూర్తి స్థాయి కామెడీ పాత్రలో నటించటం ఫ్యాన్స్ కు నచ్చుతోంది. ఈ కామెడీ ప్యాక్డ్ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకూ మెప్పించింది? అనే విషయం కోసం కాసేపట్లో పూర్తి రివ్యూ అందిస్తున్నాం.