వెంకటేష్ కుమార్తె పెళ్లి ఫిక్స్: ఎవరితో..ఎప్పుడు?


అతి కొద్ది రోజుల్లో వెంకటేష్ ఇంట పెళ్లి బాజా మోగ‌నుంది. ఆయన పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి పెళ్లికు తేదీ ఫిక్సైంది. గత కొద్ది కాలంగా ఈ వివాహం గురించి రకరకాల వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక వాటికి చెక్ చెప్తూ వివాహం చేయటానికి పెద్దలు నిర్ణయించారు. ఆశ్రిత ప్రేమ వ్యవహారాన్ని ఇటీవల తన అన్న సురేష్ బాబుతో చర్చించిన వెంకటేష్.. కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. న‌వంబ‌ర్ 24న పెళ్లి ముహూర్తం నిశ్చ‌యించార‌ని తెలుస్తోంది.

 

ఆశ్రిత తన ఫ్రెండ్ కం క్లాస్‌మేట్ తో ప్రేమ‌లో ఉన్నారు. రెండు కుటుంబాల పెద్ద‌ల్ని ఒప్పించి ఈ పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి కొడుకు..హైద‌రాబాద్ రేస్ క్ల‌బ్ ఓన‌ర్, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి క‌జిన్ అయిన‌ సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వడు అని తెలుస్తోంది.

అశ్రిత ప్రొఫెష‌న‌ల్ బేక‌ర్. రామానాయుడు స్టూడియోస్ స‌హా న‌గ‌రంలో ప‌లుచోట్ల ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో బ్యాక‌రీ వ్యాపారం నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ విదేశీ బేకరీ స్పెషల్స్ ల‌భిస్తాయి.