విశాల్ లాంటి స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానంటే అమ్మాయిలు వరస కట్టరూ …అంటూంటారు సాధారణంగా. అయితే నిజానికి సినిమావాళ్లకే వివాహానికి తగ్గ అమ్మాయిలు దొరకటం కష్టమవుతుంది. ఎందుకంటే ఎన్ని కబుర్లు చెప్పినా సినిమావాళ్లకు పిల్లను ఇవ్వటానికి రకరకాలుగా ఆలోచిస్తారనేది ఓ విషయం. అలాగే స్టార్స్ కు పెళ్లి కుదరాలంటే వారి స్దాయికి తగ్గ అమ్మాయి దొరకాలి. వాళ్ల ప్రొపిషనల్ లైఫ్ ని అర్దం చేసుకోవాలి.
అంతేనా స్టార్స్ కు ప్రేమ వ్యవహారాలు ఉంటే..వాళ్ల పెళ్లి ఇంకా లేటవుతుంది. విశాల్ కు ఇప్పుడు అదే సమస్య ఎదురౌతోంది అంటున్నారు తమిళ తంబీలు. ఆయన గత కొంతకాలంగా శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. అదీ అందరికి బహిరంగ రహస్యమే. రీసెంట్ గా విశాల్‌హీరోగా నటించి సొంతంగా నిర్మించిన తాజా చిత్రం పందెం కోడి 2 లో విలన్ గా చేసింది. ఇందులో విశాల్ కు జంటగా కీర్తీసురేశ్ నటించింది.
ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ నేఫధ్యంలో చిత్రం ప్రమోషన్ లో భాగంగా..వరలక్ష్మి ఒక టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ పెళ్లి
ఎప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ ప్రశ్నను తానూ ఆయన్ను పలుమార్లు అడిగినట్లు చెప్పి షాక్ ఇచ్చింది.
అక్కడితో ఆగిందా… ఇలాకాలం గడిచిపోతే ఆ తరువాత పెళ్లి చేసుకుందామన్నా ఎవరూ పిల్లను ఇవ్వరు అని కూడా చెప్పానని కౌంటర్ ఇచ్చింది. అయితే ఇది సరదాగా అన్నమాటే కాబట్టి అంతా లైట్ తీసుకుని నవ్వేసుకున్నారు. విశాల్ మాత్రం తాను నడిగర్‌సంఘం భవన నిర్మాణం తరువాతనే పెళ్లి చేసుకుంటాననే విషయంలో దృఢంగా ఉన్నారని చెప్పింది.