ఉపాస‌న కండోమ్ డ్రెస్‌‌.. వ‌దిన‌మ్మ‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌!

కొన్ని ప‌నులు చేయాలంటే గ‌ట్స్ కావాలి. సిగ్గు అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఇదిగో అలాంటి ప‌నే చేసింది మెగా కోడ‌లు ఉపాస‌న కొణిదెల‌. అయితే అదంతా ఓ మంచి కాజ్ కోసం చేశారు లెండి. ఇంత‌కీ అంత‌గా కాని ప‌ని ఏం చేశారు? అంటే .. లేటెస్టుగా సోష‌ల్ మీడియాల్లో ఉపాస‌న కొణిదెల షేర్ చేసిన ఈ ఫోటో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

ఉపాస‌న ప్ర‌త్యేకించి కండోమ్ ల‌తో డిజైన్ చేసిన ఓ డ్రెస్ ని తొడుక్కుని క‌నిపించారు. అయితే ఇదంతా దేనికి? అంటే.. టెక్స్ టైల్స్ వ్య‌ర్థాలు.. అలాగే ప‌నికి రాకుండా విసిరేసిన లోప‌భూయిష్ఠ‌ కండోమ్ ల‌ను ఇలా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు అని చెప్పేందుకేన‌ట‌. అయినా ఇలాంటి కండోమ్ ల‌తో డిజైన్ చేసిన డ్రెస్ తొడుక్కోవాలంటే దానికి చాలా గ‌ట్స్ కావాలి! అంటూ మెగా ఫ్యాన్స్ ఒక‌టే వ‌దిన‌మ్మ‌ను పొగిడేస్తున్నారు.

నిత్యామీన‌న్ లాంటి గ‌ట్సీ స్టార్ మాత్ర‌మే ఇలాంటివి చేయ‌గ‌ల‌రు. నిత్యా ఇంత‌కుముందు సెకండ్ హ్యాండ్ దుస్తులను ధ‌రించి వాటి ఉపయోగంపై మాట్లాడారు. దానిపై ప్ర‌శంస‌లు కురిసాయి. అలాగే ప‌లువురు స్టార్లు కండోమ్ ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టించి గ‌ట్స్ ని చూపించారు. కొన్నిసార్లు పొగ‌డ్త‌లు.. కొన్నిసార్లు తెగ‌డ్త‌లు. అయితే ఉపాస‌నకు మాత్రం అభిమానుల నుంచి యునానిమ‌స్ గా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది.