ట్విట్టర్ రివ్యూ : “సీతా రామం” అనుకున్న హైప్ ని అందుకుందా లేదా??

ఈరోజు టాలీవుడ్ సహా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధం అయ్యిన చిత్రాల్లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో మొదటిసారి నటించిన అవైటెడ్ చిత్రం “సీతా రామం”. టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేసిన ఈ చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా ఈరోజు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. 

మరి ఈ సినిమాకి ఒక్క తెలుగులోనే కాకుండా ఊహించని విధంగా ఓవర్సీస్ లో కూడా మంచి బుకింగ్స్ నమోదు అవ్వడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాకి రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్  ఆడియెన్స్ నుంచి అయితే సినిమాపై ట్విట్టర్ లో రివ్యూస్ కూడా వచ్చేస్తున్నాయి.

ఓవరాల్ గా అయితే ఈ చిత్రానికి కాస్త పాజిటివ్ మాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ కి ఎక్కువ స్కోప్ ఉందట. దుల్కర్ కూడా అదరగొట్టాడు కానీ సినిమా కాస్త స్లో గా ఉందనే కామెంట్ ఉంది. ఇక వీటిని పక్కన పెడితే సీతా రామం కి మరింత క్లీన్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి.

లవ్ స్టోరీ చాలా డీసెంట్ గా ఉందని కొన్ని ట్విస్టులు అయితే ఆశ్చర్యపరుస్తాయని అంటున్నారు. మొత్తంగా చూసినట్టు అయితే మరీ అంత బ్యాడ్ రిపోర్ట్స్ అయితే సీతా రామం కి కనిపించట్లేదు సో సినిమా బాగానే ఉన్నట్టు అనుకోవాలి.