ట్విట్టర్ రివ్యూ : నితిన్ “మాచర్ల నియోజకవర్గం” పరిస్థితి ఏంటి..?

ఇప్పుడిప్పుడే మళ్ళీ టాలీవుడ్ లో పరిస్థితి ఒక కొలిక్కి వస్తుంది. గత వారం రెండు సినిమాలు రిలీజ్ అయ్యి భారీ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ కూడా మంచి వసూళ్లు ఆ చిత్రాలు నమోదు చేస్తుండడంతో ఇక ఈ వారం సినిమాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆ రెండు సినిమాలు బాగానే ఉండడంతో ఈ సరి నితిన్ నటించిన “మాచర్ల నియోజకవర్గం” కి కూడా మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని అంతా ఆసక్తిగా చూస్తుండగా మంచి అంచనాలు నడుమ సినిమా అయితే రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా పరిస్థితి ఏంటో ఓవర్సీస్ లో షోస్ తో తెలిసిపోయింది.

ఈ చిత్రం అయితే గత వారం సక్సెస్ లను కంటిన్యూ చెయ్యలేదని అంటున్నారు. సినిమా పరమ రొటీన్ ఏక్షన్ సినిమా అని పెద్దగా చెప్పుకునే అంశాలు లేవని అంటున్నారు. ఫైట్స్ నితిన్ తప్ప సినిమాలో ఇక ఏ అంశం కూడా ఆకట్టుకోలేదని ట్విట్టర్ ప్రజానీకం మాట.

అలాగే హీరోయిన్స్ కూడా అసలు ఎందుకు ఉన్నారో కూడా అర్ధం కాలేదట. మరికొందరు అయితే ఏకంగా డిజాస్టర్ రిపోర్ట్స్ కూడా అంటున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమాకి యావరేజ్ టాక్ లా వినిపిస్తుంది. మరి నితిన్ కి అయితే ఈ సినిమా ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.