“టక్ జగదీష్” షూటింగ్ మొదలెట్టిన నేచురల్ స్టార్ నాని

tuck jagadish movie shooting restarted from yesterday
nani posted tuck jagadish working still
nani posted tuck jagadish working still

నేచురల్ స్టార్ నాని మళ్లీ ‘టక్’ చేసుకున్నారు. టక్ చేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ‘టక్ జగదీష్’ చిత్ర యూనిట్‌తో పాటు నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.నాని 26వ సినిమాగా ‘టక్ జగదీష్’ అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ‘టక్ జగదీష్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు.

tuck jagadish movie shooting restarted from yesterday
tuck jagadish movie shooting restarted from yesterday

కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఐదు నెలలపాటు తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్‌లు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ‘టక్ జగదీష్’ చేరింది. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. ‘‘జగదీష్ జాయిన్ అయ్యాడు. టక్ మొదలైంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. టక్ చేసుకుని, పక్కన మాస్క్ తగిలించుకుని వెనుక నుంచి తీసుకున్న ఫొటోను కూడా నాని ట్వీట్‌లో పొందుపరిచారు.

కాగా, ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.