జూన్ నుంచి సినిమా స్టూడియోలు కిట‌కిట‌

ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా ఏపీ ప్ర‌భుత్వం షూటింగుల‌కు అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్ నిర్మాత‌లు రెట్టించిన ఉత్సాహంతో పెండింగ్ షూటింగుల‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే సెట్స్ పై ఉన్న పాతిక చిత్రాల షూటింగులు పూర్తి చేసేయ‌నున్నారు. జూన్ నుంచి షూటింగుల‌కు అనుమ‌తులు ల‌భించాయి కాబ‌ట్టి ఆ మేర‌కు షెడ్యూల్స్ డిజైన్ చేశార‌ట‌.

అదంతా స‌రే కానీ.. లాక్ డౌన్ త‌ర్వాత ఒకేసారి షూటింగులు ప్రారంభించ‌నుండ‌డంతో ఒక్క‌సారిగా స్టూడియోలు కిట‌కిట‌లాడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు షూటింగుల కోసం స్టూడియోల‌ని బ్లాక్ చేసేశార‌ట‌. పెండింగ్ సినిమాల షూటింగులు అయిపోతే ఆ త‌ర్వాత కొత్త సినిమాల్ని ప్రారంభించే వాళ్లు ఆ ప‌నిలో బిజీ అవుతారు. అంటే ఇక రానున్న కాలంలో స్టూడియోల్లో జామ్ అయిపోవ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేయొచ్చు. రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ షూట్ ఇంకా 30 శాతం ఉండ‌గా.. ప్ర‌భాస్ జాన్ సైతం స‌గం పైగా పూర్తి చేయాల్సి ఉంది. చిరు ఆచార్య 60శాతం.. నాగార్జున వైల్డ్ డాగ్ 50 శాతం.. వెంకీ నార‌ప్ప 30 శాతం.. ప్ర‌భాస్ ఓ డియ‌ర్ 30 శాతం.. ర‌వితేజ క్రాక్ 10 శాతం.. ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ 25 శాతం.. నాగ‌చైత‌న్య ల‌వ్ స్టోరి 10 శాతం.. నానీ ట‌క్ జ‌గ‌దీష్ 60 శాతం .. విజ‌య్ ఫైట‌ర్ 60 శాతం .. గోపీచంద్ సీటీమార్ 70శాతం .. షూటింగులు చేయాల్సి ఉంది. వీట‌న్నిటికీ ఇప్ప‌టికే షెడ్యూల్స్ ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది.