లాక్ డౌన్ తో దేశం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందో తెలిసిందే. దేశాన్ని లాక్ డౌన్ ఆర్ధికంగా వెనక్కి నెట్టేసింది. అన్ని రంగాల కన్నా సినిమా రగం బాగా నష్టపోతుందని నిపుణులంటున్నారు. గత వైభవం రావాలంటే కనీసం రెండేళ్లు సమయం పడుతుందం టున్నారు. తాజాగా లాక్ డౌన్ మే 3 నుంచి 17 వరకూ పొడిగించిన సంతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ముగిసినా థియేటర్లు రీ ఓపెన్ చేయడం సాధ్యం కాదని ఇప్పటికే కథనాలొస్తున్నాయి. కనీసం ఆరు నెలలు సమయమైనా పడుతుందంటున్నారు. ఇక సినిమా షూటింగ్ లు చేసుకోవడంలో కొన్ని మినహాయింపులు ఉడొచ్చు. సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ లు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
ఇప్పటివరకూ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఓటీటీ ప్లాట్ పామ్ లపైనే నష్టమో! లాభమో భరించి రిలీజ్ చేసేస్తారు. ఇలా ఎన్నాళ్లు చేయగలరు. ఎలా చూసిన రెండు నెల రెండు నెలల్లో అన్ని సినిమాలు రిలీజ్ అయిపోతాయి. ఆతర్వాత పరిస్థితి ఏంటి? ఇంకేముందు డబ్బింగ్ సినిమాలే దిక్కు అని అంటున్నారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. ఇప్పుడు పరిశ్రమను ఆదుకోవాల్సింది అనువాద చిత్రాలే. వేరే భాషల్లో రిలీజైన సినిమా హక్కులు తీసుకుని అనువాదం చేసుకుంటే కొంత వరకూ డబ్బు సంపాదించుకోవొచ్చు అన్నారు.
చాలా మంది అగ్ర నిర్మాతలు, చిన్న స్థాయి నిర్మాతలు ఇప్పటికే వేర్వేరు భాషల సినిమా హక్కులు తీసుకుని రిలీజ్ చేయలేకపోయారు. చాలా సినిమాలు ల్యాబ్ ల్లోనే మూలుగుతున్నాయి. ఇప్పుడు ఆ చిత్రాల బూజు దులుపి రిలీజ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొన్ని నెలల పాటు ఆ చిత్రాలకు థియేటర్ల సమస్య కూడా ఉండదు. ప్రేక్షకుడికి ఏదో రూపంలో వినోదం కావాలి కాబట్టి! వాటిని చూసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
