ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో 107 వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పక్కా ఒక మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
అయితే ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి మంచి లైనప్ కుదిరింది. నిజానికి ఇది తన లాస్ట్ భారీ హిట్ “అఖండ” నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత బాలయ్య రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఓకే చేసాడు. వాటిలో గోపీచంద్ తో సినిమానే ఇప్పుడు చేస్తుండగా నెక్స్ట్ దర్శకుడు అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నారు.
మరి ఈ సినిమా కోసం బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ని రంగంలోకి దింపే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. మరి ఆ సాలిడ్ మరెవరో కాదు సోనాక్షి సిన్హా అట. ప్రస్తుతానికి సినీ వర్గాల్లో ఇదే మాట వైరల్ గా వినిపిస్తుంది.
అయితే ఇది వరకే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ తో చేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి దీనిపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా బాలయ్య 107 అయ్యిన వెంటనే స్టార్ట్ చేయనున్నారు.