టాలీవుడ్ స్టార్ హీరోలను ఫ్లాప్ ల నుండి గట్టెక్కించిన సినిమాలు ఇవే?

చిత్ర పరిశ్రమలో సినిమాలు హిట్ కొట్టడం, ప్లాప్ కావడం ఎవరు ఊహించలేరు. వరుసగా నాలుగు లేదా ఐదు చిత్రాలు ప్లాప్ అయితే ఇక ఆ హీరో పని అయిపోయింది అనుకుంటారు. అలా ప్లాప్ లలో ఉన్న హీరోలను కెరీర్లో నిలదొక్కుకునేలా బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన హీరోల సినిమా వివరాలు ఏంటో చూద్దాం.

 

మెగాస్టార్ చిరంజీవి: 1992లో ఘరానా మొగుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు చిరంజీవి. ఈ సినిమా తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి దాదాపుగా ఐదు సంవత్సరాలు పట్టింది. 1997లో వచ్చిన హిట్లర్ సినిమా ద్వారా ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది.

బాలకృష్ణ: 2001లో నరసింహనాయుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు బాలకృష్ణ. ఈ సినిమా తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి దాదాపుగా 9 సంవత్సరాలు పట్టింది. 2010లో వచ్చిన సింహా సినిమా ద్వారా మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టి తన రేంజ్ ఏంటో చూపించాడు.

నాగార్జున: 1989లో వచ్చిన శివ సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు నాగార్జున. తర్వాత హిట్ కొట్టడానికి మూడు సంవత్సరాల సమయం. 1992లో వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాంతో మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తర్వాత హిట్ కొట్టడానికి దాదాపుగా 8 సంవత్సరాలు పట్టింది. 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వొస్తావని చిత్రం ద్వారా ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది. తరువాత 2002లో వచ్చిన సంతోషం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

విక్టరీ వెంకటేష్: 2007లో వచ్చిన తులసి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తర్వాత హిట్ కొట్టడానికి దాదాపుగా ఆరు సంవత్సరాలు పట్టింది. 2013లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ హీరోలలో ఒకడుగా రాణిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: 2001లో ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తర్వాత మధ్యలో జల్సా సినిమా హిట్ కావడం జరిగింది. ఇక 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీలో తన రేంజ్ ఏంటో చూపించాడు.

మహేష్ బాబు: 2006లో పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తర్వాత మళ్లీ 2011లో దూకుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు.

ప్రభాస్: 2005లో ఛత్రపతి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మళ్లీ 2010లో డార్లింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్: 2003లో వచ్చిన సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తరువాత రాఖీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 2007 లో వచ్చిన యమదొంగ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తర్వాత మళ్లీ 2015లో టెంపర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

పవర్ స్టార్ రామ్ చరణ్: 2013లో మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తరువాత 2018లో విడుదలైన రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.