తీవ్ర‌వాదిగా మారిన స్టార్ హీరోయిన్

అక్కినేని కోడ‌లు స‌మంత‌ని ఇప్ప‌టివ‌ర‌కూ వెండి తెర‌పై హీరోయిన్ గానే చూసాం. గ్లామ‌ర్ పాత్ర‌ల్లో..భార్య పాత్ర‌ల్లోనే అమ్మడు మెప్పించింది. కానీ స‌మంత ఇప్పుడు రూపం మార్చుకోబోతుంది. గ‌డ‌గ‌డ‌లాడించే ప్ర‌మాద‌క‌ర‌మైన లేడీ తీవ్ర‌వాది పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. లేడీ తీవ్ర‌వాదులు వ‌ల‌పు బాణ‌మేసి శ‌త్రుదేశాల ర‌హ‌స్యాల‌ను ఎలా చేధిస్తారో? అలా చేధించ‌డానికి రెడీ అవుతోంది. అదీ బుల్లి తెర‌పైనా! ఇంకెందుకు ఆల‌స్యం. అల‌సు విష‌యంలోకి వెళ్తే.. స‌మంత బాలీవుడ్ లో `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో స‌మంత తీవ్ర‌వాది పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మ‌నోజ్ బాజ్ పాయ్ `రా `ఇంటెలిజెన్స్ అధికారికా న‌టిస్తుండ‌గా, ఆయ‌న భార్య పాత్ర‌లో ప్రియ‌మ‌ణి న‌టిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. కరోనా కార‌ణంగా షూటింగ్ లు అన్ని నిలిచిపోవ‌డంతో ఈ వెబ్ సిరీస్ కి బ్రేక్ ప‌డింది. తాజాగా స‌మంత కొత్త ఫోటో ఒక‌టి ఇన్ స్టా గ్రామ్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది. మ‌రి ఈ ఫోటో వెబ్ సిరీస్ కి సంబంధించిన‌దా? వ‌్య‌క్తిగ‌త ఫోటోనా? అన్న‌ది తెలియ‌దు గానీ! అమ్మ‌డు మాత్రం చూడ‌టానికి తీవ్ర‌వాదిగానే క‌నిపిస్తోంది. క‌శ్మీర్ వీధుల్లో రోడ్డు సైడ్ షాప్ ప‌క్క‌న దిగిన ఓ ఫోటోలా ఉంది. అందులో అమ్మ‌డి క్లివేజ్ అందాలు ఎలివేట్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియా అంత‌టా జోరుగా వైర‌ల్ అవుతోంది. స‌మంత లుక్ పై ర‌క‌ర‌కాల కామెంట్లు వేస్తూ నెటి జ‌నులు ఆనందిస్తున్నారు. ఇక పెళ్లైన త‌ర్వాత స‌మంత సెల‌క్టివ్ గానే సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. డిఫ‌రెంట్ జాన‌ర్ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. భ‌విష్య‌త్ సినిమా అంతా డిజిట‌ల్ దే కావ‌డంతో స‌మంత కూడా వెబ్ సిరీస్ ల వైపు ఆస‌క్తి చూపించి ముందుకెళ్తోంది. అలాగే కోలీవుడ్ లో స‌మంత స‌త్తా చాటుతోన్న సంగ‌తి తెలిసిందే.