తెలుగు హీరోయిన్ వ్యాపారం !

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోయిన్స్ లో ఏదో అరకొర సినిమాలతో సినిమా న్యూస్ లో కనిపిస్తోన్న బ్యూటి ‘ఈషా రెబ్బా’. పాప కెరీర్ అటు ముందుకు పోదు.. ఇటు వెనక్కి పోదు. గత పదేళ్ళ నుండి కెరీర్ అలాగే సాగుతుంది. పాపం అమ్మడు కూడా ఇదే ఫీలింగ్ లో ఉందట. అందుకే వేరే సైడ్ బిజినెస్ ఉంటే బెటర్ అని ఫీల్ అవుతుందట. నిజానికి ఇషా నటించిన గత సినిమాలు అరవింద సమేత, ‘రాగల 24 గంటల్లో’ సినిమాల మంచి హిట్ అయ్యాయి. అయితే హిట్ అందుకున్న ఆ స్థాయిలో ఇషాకి గుర్తింపు రాలేదు. ఆ మాటకొస్తే మొదటినుంచీ ఈషాకి చెపుకోదగ్గ అవకాశాలొచ్చినా ఆశించిన విజయాలు అయితే దక్కలేదు. దక్కినా అవి పాప క్రెడిట్ లోకి పడట్లేదు.

అందుకే అమ్మడు రూట్ మార్చి బోల్డ్ క్యారెక్టర్స్ కూడా సై అని స్టేట్ మెంట్స్ ఇచ్చి మరీ కొన్ని సినిమాల్లో కాస్త హద్దులు దాటింది. అయినా మనోళ్ళ కళ్ళకు ఈ బ్లాక్ బ్యూటీ అందాలు పెద్దగా అనలేదు. అందుకే హాట్ స్టిల్స్ కూడా ఈ మధ్య బాగానే వదులుతుంది. ఎన్ని వదిలినా ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయినా.. తెలుగు హీరోయిన్ అనే ఇమేజ్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వడం అయ్యేపని కాదు. ఈ విషయం ఈషాకి అర్ధమైనట్లు ఉంది. అందుకే తన గ్లామర్ తోనే కాకుండాతన తెలివితేటలతోనూ డబ్బు సంపాదించాలని ప్రణాళికలు వేస్తోంది.

కరోనా అనంతరం హోటల్ బిజినెస్ లోకి ఈషా రెబ్బా దిగబోతుంది. ఇప్పటికే మియాపూర్ లోని ఓ హోటల్ ను రెండు సంవత్సరాలకు గానూ లీజ్ కి తీసుకుంది. మరి హీరోయిన్ హోటల్ అనగానే ఒక తెలియని ఆసక్తి ఉంటుందాయే. పైగా పాప కూడా రెగ్యూలర్ హోటల్ లా కాకుండా.. కొంచెం యూత్ కి నచ్చే సౌకర్యాలతోనే హోటల్ ను రన్ చేయాలని ప్లాన్ చేస్తోందట. మరి ఈషా రెబ్బా హోటల్ బిజినెస్ లో ఏ రేంజ్ లో రాణిస్తోందో చూడాలి. ఇక ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగు బ్లాక్ బ్యూటీ వ్యాపారంలో వెలిగిపోవాలని ఆశిద్దాం.