కేసీఆర్ బయోపిక్ ట్రైలర్ వచ్చేసింది..చూసారా?

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ ను అనుసరిస్తూ… ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్, మరో వైపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ రూపొందుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ గా ‘తెలంగాణ దేవుడు’ అనే సినిమా రూపొందుతోంది. ఈ బయోపిక్ లో తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి ట్రైలర్ రిలీజ్ చేసారు. అయితే ట్రైలర్ ఆరు నిముషాల పాటు సాగటం విశేషం. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ప్రముఖ దర్శకుడు సాగర్‌ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన హరీష్‌ వడ్‌త్యా దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, అలీ, సుమన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాక్‌ ల్యాబ్స్‌ పతాకంపై మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మిస్తున్నారు.

ఈ బయోపిక్ లో కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయనాయకుడిగా ఆయన ఎదుగుదల, తెలంగాణ ఉద్యమం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఆయన జీవితంలోని ముఖ్యమైన దశలను తెరకెక్కిస్తున్నారని శ్రీకాంత్ అన్నారు.

ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో తాను కనిపిస్తున్నప్పటికీ ఆయన పేరును మాత్రం వాడుకోవడం లేదనీ, తనపాత్ర పేరు విజయ్ దేవ్ అని చెప్పారు. తనకి ఎంతో ఇష్టమైన కేసీఆర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, తెలంగాణ భాషలో డైలాగ్స్ చెప్పే విషయంలో నటుడు ఉత్తేజ్ తనకి ఎంతో సహకరిస్తున్నాడని తెలిపారు.

మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌. ప్రగతి, ప్రభావతి, తోటపల్లి మధు, కోటేశ్‌ మానవ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్‌ రాజ్‌ బొబ్బిలి, కెమెరా: ఎ. విజయ్‌ కుమార్‌.