(ధ్యాన్)
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `సైరా నరసింహా రెడ్డి`. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా టీజర్ రీసెంట్‌గా విడుదలై యూ ట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా కోసం పోటీలు పడుతున్నారట. ఓవర్‌సీస్‌లో అయితే సినిమా కోసం ఇరవై కోట్ల ఆఫర్ వచ్చింది. అయితే నిర్మాత రామ్‌చరణ్ మాత్రం ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాట్ట. చరణ్ రేటు వినగానే డిస్ట్రిబ్యూటర్స్ భయపడుతున్నారట. 20 కోట్ల రూపాయలు తిరిగి రావాలంటేనే బాక్సాఫీస్ వద్ద సినిమా ఐదు మిలియన్ డాలర్స్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో 35 కోట్లకు కొంటే.. అది రాబట్టుకోవడం విపరీతమే అవుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా కొంటే వారికి కొంత మిగిలాలి కదా.. సైరా ఇది న్యాయమా?