`సైరా` నిడివి 3.30 గంటలు!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `సైరా: నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వం హిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దాదాపు 200 కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని ప్రచారమవుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 2న సినిమాని రిలీజ్ చేయనున్నారు. చిత్రీకరణ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా రన్ టైమ్ విషయంలో ఓ ఠఫ్ టాస్క్ ఎదురైందట. ఎడిటింగ్ లో 3.30 గంటల నిడివి వరకూ సురేందర్ రెడ్డి తేగలిగారట. ఆ మేరకు ఆయన ఎడిటింగ్ ని సమర్థంగానే హ్యాండిల్ చేశారు. అయితే అంత సుదీర్ఘ సమయం ప్రేక్షకులు థియేటర్లలో కూచోవాలంటే అదో ఛాలెంజ్ లాంటిదే. అందుకే మెగాస్టార్ చిరంజీవి మరో 30 నిమిషాలు తగ్గించాలని సూచించారట. మూడు గంటల సినిమా అంటే ఓకే. చరణ్ నటించిన రంగస్థలం చిత్రానికి 3గం.ల నిడివి తప్పదని సుకుమార్ చెప్పినా చిరు సినిమా చూశాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈసారి సురేందర్ రెడ్డి 3.30 నిమిషాల నిడివి గురించి బాస్ తో చర్చించినా.. ఆ 30 నిమిషాల నిడివి తగ్గించాలని అన్నారట. అందుకోసం తనే స్వయంగా బరిలో దిగితే బావుంటుందని చిరు భావిస్తున్నారట.
ఎడిటింగ్ టేబుల్ పై ఎన్నో సినిమాల జాతకం మార్చిన అనుభవం చిరంజీవి సొంతం. ఫలానా ల్యాగ్ తీసేయాలి అన్న సూచన చేయడంలో ఆయన ఎక్స్ పర్ట్. అందుకే సైరా- నరసింహారెడ్డికి అర్థగంట నిడివి తగ్గించేందుకు చిరు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఆ రన్ టైమ్ తగ్గితే ఆ మేరకు వీఎఫ్ఎక్స్ పనుల్లోనూ జాప్యం ఉండదు. అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ విషయంలో చిరు – చరణ్- సూరి టీమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.