చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) కానుకగా ఈ రోజు, అభిమానులు,రాజకీయ పార్టీలు కూడా ఎంతో కాలంగా ఎదురచూస్తూ వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి ’ చారిత్రక చిత్రం టీజర్ విడుదలయింది.
టీజర్‌లో సైరా నరసింహారెడ్డిగా చిరు లుక్‌ను ఎలా ఉంటుందో బయటపెట్టారు. టీజర్ సైరా ఎంత బ్రహ్మాండంగా, భారీ గా ఉంటుందో ఒక్క తళుకులో చూపించింది. ఈ యుద్ధం ఎవరిది అంటూ చిరు గొంతు విప్పి వేసిన ప్రశ్నకు నరసింహారెడ్డి అనే అరుపుతో టీజర్ దద్దరిల్లింది. చిరంజీవిలో నాటి తిరుగుబాటు దారుడు రోషం, ఆగ్రహం ధగధగలాడాయి. కళ్లు నిప్పుల్లా మండిపోయాయి. టీజర్ ను ఇండికేటర్ గా తీసుకుంటే పూర్తి చిత్రం వొళ్లు జలదరించేలా ఉంటుందని పిస్తుంది. బాహుబలినిబీట్ చేయాలన్నది కొణిదెల ఫామిటీ డ్రీమ్. చూద్దాం ఏమవుతంది.
సైరా నరసింహారెడ్డి కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. కర్నూలూ జిల్లాకు చెందిన ఈ వీరుడి జీవితం జానపద గీతాల్లో తప్ప పెద్ద గా చరిత్రకారుల రచనలకెక్కలేదు. చిరంజీవి కళ్లు ఆయన జీవితం మీద పడ్డాయి. అంతే, ఈ భారీ చిత్రం తయారవుతూ ఉంది.
ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా మటుకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార, చిరు సరసన హీరోయిన్‌గా నటిస్తున్నది. తమన్నా మరో కీలక పాత్రలోదర్శనమిస్తుంది. బాలీవుడ్ అమిత్ త్రివేదిది సంగీతం.