స్వీటీ అనుష్క శెట్టి పెళ్లికి సమయం ఆసన్నమైందన్న ప్రచారం అంతకంతకు వేడెక్కిస్తోంది. పెళ్లి సహా ఎఫైర్లపైనా అంతే జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలి సమయంలో డార్లింగ్ ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని పెళ్లాడేస్తుందని మీడియాలో కథనాలొచ్చినా వాటిని ఆ ఇద్దరూ ఖండించారు. ఆ క్రమంలోనే దర్శకుడు క్రిష్ తో అనుష్క ఎఫైర్ సాగిస్తోందంటూ ప్రచారం సాగించారు.
ఆ తర్వాత కూడా ఓ ప్రముఖ నిర్మాతతో అనుష్క డేటింగ్ లో ఉందని పబ్లిసిటీ హీట్ పెంచింది. ఇటీవల మళ్లీ స్వీటీ పెళ్లి వార్తలు వేడి పెంచుతున్నాయి. ఇంతకుముందు ఓ క్రికెటర్ ని పెళ్లాడబోతోందన్న ప్రచారంతో అగ్గి రాజుకుంది. ఫ్యాన్స్ ఎవరా క్రికెటర్ అంటూ ఆరాలు తీసారు. కానీ అది కూడా నిజం కాలేదు. ఇంతలోనే ఓ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి కుమారుడిని అనుష్క పెళ్లాడనుందని ప్రచారమైంది. అతడు అప్పటికే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నాడు. పైగా ఆ కుటుంబానికి స్వీటీ ఎంతో క్లోజ్! అందువల్ల ఆ ఇద్దరికీ బాగా కుదిరిందంటూ ప్రచారం సాగిపోయింది. అయితే దీనిపైనా ఎవరూ బయటపడలేదు.
మళ్లీ ఇప్పుడు అవే వార్తలకు బలం చేకూరుతుండడం చూస్తుంటే ఇక స్వీటీ అతడినే పెళ్లాడే వీలుందన్న గుసగుసలు వేడెక్కించేస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత? అన్నది స్వీటీనే చెబుతుందేమో. ప్రతిసారీ తనపై వచ్చే ఈ రూమర్స్ కి స్వయంగా చెక్ పెట్టాల్సిన పని పడుతోంది మరి.