38 వ‌సంతాల `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` ఆయ‌న కెరీర్ క్లాసిక్ సినిమాల్లో ఒక‌టిగా చిర‌స్థాయిగా నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. 1982 ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదలైంది. నేటికి 38 సంవత్సరాలు పూర్త‌యింది. ప్ర‌ఖ్యాత ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ తొలి సారీ కథ, స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వ‌హించ‌గా, గొల్లపూడి మారుతీరావు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వ్వ‌డ‌మే గాక మూవీకి అద్భుత మైన మాటలు అందించారు.

సినిమా క‌థ ప‌రిశీలిస్తే.. రాజశేఖరం(చిరంజీవి) ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి) తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల ప్రవర్తన గల సుబ్బారావు(గొల్లపూడి) జయలక్ష్మి(మాధవి) మీద కన్నేస్తాడు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధాన కథ.

ఈ చిత్రం 8 కేంద్రాల్లో 50 రోజులు 2 కేంద్రాల్లో 100 రోజులు రన్ అయ్యింది. హైదరాబాద్ సిటీ లో డైరెక్ట్ రిలీజ్ లో శాంతి (నారాయణ గూడ) లో 3 ఆటలు -106 రోజులు ఆడింది. నాంపల్లి – లత లో ఉదయం ఆటలు -52 రోజులు డైరెక్ట్ రన్ సాగింది. + షిఫ్ట్ పై హైద‌రాబాద్ సిటీ లో 519 రోజులు రన్ అవ్వ‌డం గొప్ప విశేషంగా చెప్పుకున్నారు. మెగాస్టార్ న‌ట‌న‌కు.. కోడి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు .. గొల్ల‌పూడి న‌ట‌న .. మాట ప‌వ‌ర్ కి గొప్ప పేరొచ్చింది.

intlo ramayya