బామ్మే కాదు మహేష్ కూడా ఫుల్ హ్యాపీ..(ఫొటోలు)

రాజమండ్రికి చెందిన ఒక 106 సంవత్సరాల రేలంగి సత్యవతి మహేష్ బాబుకు వీరాభిమాని. ఎప్పటినుండో మహేష్ ను కలవనుకున్న కుదురలేదు. ఆమె తనకు మహేష్ బాబును చూడాలని ఉందని అతడితో ఒక ఫొటో దిగాలని ఉందని చెప్పడంతో ఆమద్య మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరకు ఆ విషయం చివరకు మహేష్ బాబు వరకు వెళ్లింది. అంత పెద్దామె తనను చూడాలని కోరుకుంటుందని తెలిసిన మహేష్ బాబు వెంటనే స్పందించి, తను అమెరికా నుంచి రాగానే కలుస్తాను అన్నారు.

మహర్షి చిత్ర షూటింగ్ సెట్ కు ఆమెను పిలిపించి ఆమె తో సరదాగా మాట్లాడారు మహేష్. ఆ తరువాత ఆమె తో కలిసి ఫొటోలు కూడా దిగారు. బామ్మగారితో చాలా సమయం ఆప్యాయంగా మాట్లాడి ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నాడట. ఆమె కోరుకున్నట్లుగా ఫొటోను కూడా తీసుకుని ఆమెను సంతోష పెట్టాడు. ఆమెకు కొత్త బట్టలు పెట్టడంతో పాటు సెట్ లోనే బోజనం ఏర్పాటు కూడా చేయించాడట.

 

ఆమెతో దిగిన ఈపోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి సత్యవతి గారిని కలిసినందుకు ఆమె కంటే ఎక్కువ నాకే సంతోషం గా ఉందని అన్నారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక మహేష్ నటిస్తున్న మహర్షి ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక భారీ విలేజ్ సెట్ లో జరుగుతుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.