సూపర్ న్యూస్ : ఓటీటీలో “సీతా రామం” రిలీజ్ ఎప్పుడు, ఎందులోనో ఫిక్స్డ్..!

తెలుగు సినిమా ఒక్కసారిగా డీలా పడ్డ పరిస్థితుల్లో సరైన హిట్ కావాలని ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన సినిమానే “సీతా రామం”. మలయాళ స్టార్ హీరో కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మన తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఒక బ్యూటిఫుల్ ప్రేమ కథా చిత్రం “సీతా రామం”.

ఇప్పటికీ కూడా తెలుగులో అద్భుతమైన రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నవారికి అయితే ఇప్పుడు మొత్తానికి బిగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 9 నుంచే స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా అనౌన్స్ చేసేసారు.

తెలుగు మరియు తమిళ్ సహా మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వస్తున్నట్టుగా తెలిపారు. దీనితో అయితే ఓటిటి వీక్షకులకు ఇది సూపర్ న్యూస్ అని చెప్పి తీరాలి. ఇంకా ఈ సినిమాలో అయితే రష్మికా మందన్నా కూడా కీలక పాత్రలో నటించగా సుమంత్, తరుణ్ భాస్కర్ తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో నటించగా విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించాడు.