సందీప్ కిష‌న్, హ‌న్సిక తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్ సినిమా ఓపెనింగ్.. 

కుర్ర హీరో సందీప్ కిష‌న్  తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 17 సోమ‌వారం ఈ సినిమా ఓపెనింగ్ జ‌రిగింది. ప్ర‌ముఖ నిర్మాత‌లు అనిల్ సుంక‌ర‌, భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా వ‌చ్చారు. హీరో సందీప్ కిష‌న్ పై తొలి క్లాప్ నిర్మాత అనిల్ సుంక‌ర కొట్టారు.. మ‌రో నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఛార్మింగ్ బ్యూటీ హ‌న్సిక ఇందులో సందీప్ కిష‌న్ తో తొలిసారి జోడీ క‌ట్టారు. భూమిక చావ్లా ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ముర‌ళి శ‌ర్మ, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి మొద‌లు కానుంది. 

 

న‌టీన‌టులు: 

సందీప్ కిష‌న్, హ‌న్సిక‌, భూమిక‌, ముర‌ళి శ‌ర్మ, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, వెన్నెల కిషోర్, ప్ర‌భాస్ శీను, పృథ్వీ త‌దిత‌రులు